టెన్త్ పరీక్షలపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్
అమరావతి జూన్ 15
పరీక్షల సంసిద్ధతకు విద్యార్థుల్లో మానసిక స్థైర్యం నింపాలని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. పదవ తరగతి పరీక్షలపై ఆయన అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులు,జేసీ, పేరెంట్స్ కమిటీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, పాఠశాల విద్య కమిషనర్ వాడ్రేవు చినవీరభద్రుడు, ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఎ.సుబ్బారెడ్డి పాల్గొన్నారు.