YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కార్యక్షేత్రంలోకి దిగిన తమ్ముళ్లు

కార్యక్షేత్రంలోకి దిగిన తమ్ముళ్లు

కార్యక్షేత్రంలోకి దిగిన తమ్ముళ్లు
గుంటూరు, జూన్ 16, 
ఒక పక్క కరోనా వైరస్ కల్లోలం నడుస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో వైరస్ బాగానే వ్యాప్తి చెందుతుంది. పరిస్థితి అర్ధం కావడంతో ఏపీకి ఒక్కసారి మాత్రం వచ్చి తిరిగి హైదరాబాద్ సేఫ్ అనుకోవడంతో చంద్రబాబు దుకాణం మార్చేశారు. అయితే అన్ని అనుకున్నట్లు జరగవు కదా. ఒక్కసారిగా ఎపి లో అధికారపార్టీ దూకుడు పెంచింది. అధికారపార్టీ లో గతంలో తప్పులు చేసిన వారి చిట్టా ముందేసుకుని లెక్కలు సరి చేసే ప్రయత్నంలో చాలా బిజీ అయిపొయింది.తన కుడి, ఎడమ భుజాలవంటి నేతలకు జైలు గండం రావడంతో చంద్రబాబు హైదరాబాద్ లోని తన కోటను వీడి తిరిగి అమరావతి లోని కరకట్ట నివాసానికి చేరుకోక తప్పలేదు. ఆయనతోపాటు తనయుడు లోకేష్ సైతం యాక్టివ్ అయిపోయారు. కరోనా భయంతో భాగ్యనగర్ లో ఉంటే సీన్ సితార అయ్యేలాగే ఉందని బెంబేలు పడుతుంది పసుపు దళం. తమ అధినేత ఇక జూమ్ యాప్ కి స్వస్తి చెప్పి కార్యక్షేత్రంలోకి దిగి దిశా దశా నిర్దేశించకపోతే మరికొందరు నేతలు అచ్చెన్న బాటలో కేసుల బారిన పడతారని తమ్ముళ్లు హడలిపోతున్నారు. ఒకేసారి పార్టీలోని అగ్ర నేతలుగా ఉన్న వారందరిపై వివిధ రకాల కేసుల్లో చిక్కుకోవడంతో సైకిల్ పార్టీ డీలా పడింది.అనంతపురం లో జెసి ప్రభాకర రెడ్డి, అస్మిత్ రెడ్డి, తూర్పుగోదావరి లో యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, పిల్లి సత్తిబాబు వంటి వారిపై కేసులు నమోదు కావడంతో క్యాడర్ కి కరోనా కష్టాల్లో వీధికెక్కి పోరాటం చేయలేక సామాజిక వేదికలపై ఖండించి సరిపెడుతుంది. దాంతో చంద్రబాబు కరకట్టలోని తన గృహంలో కొందరు నేతలతో కాగడాలతో నిరసన చేపట్టారు. ఇలా రోజుకో నిరసన ఇంటి నుంచే చేపట్టాలన్నది టిడిపి అధినేత చంద్రబాబు వ్యూహం గా కనిపిస్తుంది. ఇదే రీతిలో నిరసన తెలపాలనే సందేశాన్ని ఆయన శ్రేణులకు పంపిస్తున్నారు. ఒక పక్క కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ ప్రజల్లోకి తమ ఉద్యమం తీసుకువెళ్లేలా టిడిపి ఆ విధంగా ముందుకు పోతుంది. ఇప్పటికే అధికారపార్టీ నిరసనలు తెలిపే ప్రధాన విపక్షం ఏ మాత్రం లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించినా ముందుగా ఆ కేసులు నమోదు చేస్తూ ఉండటంతో తీవ్ర సంకట పరిస్థితిని ఎన్నడూలేనివిధంగా ఎదుర్కొంటుంది తెలుగుదేశం.

Related Posts