YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

కోడలు దిద్దే కాపురం వద్దు...

కోడలు దిద్దే కాపురం వద్దు...

కోడలు దిద్దే కాపురం వద్దు...
విజయనగరం, జూన్ 16
కోడలు ఎదుగుదల చూసి ఏ మామ అయినా ఆనందిస్తారు. కుటుంబం పరువు ప్రతిష్టలకు అండగా నిలుస్తారు. కానీ కురుపాం నియోజకవర్గంలో మాత్రం మామ కోడలు ఉన్నతిని సహించలేక పోతున్నారు. కుటుంబంలో తలెత్తిన విభేదాల కారణంగానే కోడలు పుప్పశ్రీవాణి నాయకత్వాన్ని మామ శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు అంగీకరించలేక పోతున్నారు. గత ఏడాది కాలంగా తనను పక్కన పెట్టి అంతా కొడుకు,కోడలు నియోజకవర్గాన్ని చూసుకుంటడంతో ఆయన సహించలేకపోతున్నారు.కురుపాం నియోజకవర్గంలో శత్రుచర్ల కుటుంబానికి మంచి పట్టుంది. కురుపాం నుంచి గెలిచిన వారు రాజకీయంగా ఏదో ఒక పదవి పొందుతారు. గతంలో శత్రుచర్ల విజయరామరాజు, కిషోర్ చంద్రదేవ్ లు ఈప్రాంతం నుంచే రాజకీయంగా ఎదిగారు. శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు స్వయనా విజయరామరాజు సోదరుడు. గతంలో ఆయన ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యారు. అయితే ఎస్టీ లు కాదన్న న్యాయస్థానం తీర్పుతో ఎస్టీ వర్గానికి చెందిన పాముల పుష్ప శ్రీవాణిని కోడలిగా తెచ్చుకున్నారు. 2014లో గెలిచిన పాముల పుష్పశ్రీ వాణి పార్టీనే నమ్ముకుని ఉన్నారు.కానీ చంద్రశేఖర్ రాజు మాత్రం 2018లో వైసీపీని వీడి టీడీపీలో చేరారు. తర్వాత కొడుకు పరిక్షిత్ రాజు, కోడలు పుష్ప శ్రీవాణిలు వత్తిడితో ఆయన తిరిగి 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలో చేరిపోయారు. ఆయన బలం కూడా గెలుపునకు అవసరం కావడంతో కుటుంబ సభ్యులు ఆయన సహకారాన్ని పొందారు. గెలిచిన తర్వాత పుష్ప శ్రీవాణి డిప్యూటీ సీఎం అయ్యారు. నిజానికి ఇది శత్రుచర్ల కుటుంబానికి దక్కిన అరుదైన గౌరవంగానే భావించాలి. గత కొద్ది రోజులుగా తిరిగి కుటుంబంలో విభేదాలు తలెత్తినట్లు తెలిసింది. కోడలు, కుమారుడు రాజకీయంగా తనను పట్టించుకోవడం లేదన్న ఆక్రోశంతో చంద్రశేఖర్ రాజు ఉన్నారు. అందుకే నియోజకవర్గంలో అభివృద్ధి జరగడం లేదని, ప్రభుత్వపాలన సక్రమంగా లేదని విమర్శలు చేశారు. ఇది డిప్యూటీ సీఎంకు కొంత ఇబ్బంది కర వాతావరణమే. అయితే మామ వ్యాఖ్యలపై ఆమె స్పందించలేదు. కుమారుడు పరిక్షిత్ రాజు మాత్రమే స్పందించారు. నలభై ఏళ్ల నుంచి శత్రుచర్ల కుటుంబం నియోజకవర్గానికి ఏం చేసిందని డిప్యూటీ సీఎం అనుచరులు ఎదురుదాడికి దిగారు. అయితే కుటుంబంలో నెలకొన్న విభేదాల కారణంగానే డిప్యూటీ సీఎం పాముల పుష్ప శ్రీవాణిపై మామ చంద్రశేఖర్ రాజు విరుచుకుపడ్డారని తెలిసింది. కుటుంబ విభేదాలు కాబట్టి త్వరలోనే సర్దుకుంటాయంటున్నారు

Related Posts