YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

నిమ్మ రైతులకు కష్టాలు

నిమ్మ రైతులకు కష్టాలు

నిమ్మ రైతులకు కష్టాలు
ఏలూరు, జూన్ 16,
ఆరుగాలం కష్టించి పంట పండించే రైతన్నకు గిట్టుబాటుధర దక్కడం లేదు. దానికి తోడు దళారీల మాయాజాలం అన్నదాతల వెన్ను విరిచేస్తోంది. జిల్లాలో 13వేల ఎకరాల్లో నిమ్మసాగు జరుగుతోంది.  ఏటా లక్ష టన్నుల పంట ఉత్పత్తి అవుతోంది. పెదవేగి, జంగారెడ్డిగూడెం, ద్వారకాతిరుమలు, కామవరపుకోట, నల్లజర్ల, తదితర మండలాల్లో నిమ్మ సాగవుతోంది. ఈ మండలాల్లో పండించే నిమ్మకాయలను రైతులు వివిధ వాహనాల్లో ఏలూరు, గోపన్నపాలెం మార్కెట్లకు తెస్తుంటారు. ఇక్కడ కమీషను వ్యాపారులు కొనుగోలు  చేస్తారు. అక్కడి నుంచి వివిధ రాష్ట్రాల ట్రేడర్లు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు.నిన్న మొన్నటి వరకు ఆశాజనకంగా ఉన్న నిమ్మధర నేడు పాతాళానికి పడిపోయింది. ఆ ధర ఏరకంగానూ గిట్టుబాటు కాకపోవడంతోపాటు నష్టం వాటిల్లుతోంది. కానీ రైతుల వద్ద నుంచి వ్యాపారులు రెట్టింపు స్థాయిలో కమీషను వసూలు చేస్తున్నారు. దీంతో అన్నదాతకు కన్నీళ్లే మిగులుతున్నాయి.సౌకర్యాలు లేమితో ఇబ్బందులు ట్రేడర్లు వ్యవసాయ మార్కెట్టు కమిటీకి ఒక శాతం సెస్సు చెల్లిస్తుంటారు. ఒక్క ఏప్రిల్‌ నెలలోనే రూ. 30 లక్షల వరకు సెస్సు ఆదాయం వచ్చింది. ఏడాదిలో రూ. కోటిన్నరకు పైగా ఆదాయం వస్తోంది. ఈ సొమ్ముతో రైతులకు మార్కెట్టు యార్డులో సౌకర్యాలు కల్పించాలి. ఇక్కడ విశ్రాంతి భవనం అధ్వానంగా ఉంది. అల్పాహారం తీసుకునే క్యాంటీన్‌ నిర్వహణ సక్రమంగా లేదు. ఇక్కడకు వచ్చే రైతులు వారి కష్టాలు వారు పడాల్సిందే. వారిగురించి పట్టించుకునేవారే ఉండరు.మాకు మిగిలేది లేదు.. ధర దారుణంగా పడిపోయింది. మా గ్రామంనుంచి ఇక్కడవరకు అతికష్టమ్మీద కాయలు తెస్తున్నాం. ఖర్చులుపోగా బస్తా వద్ద మిగిలేది రూ.20మాత్రమే. కమీషను 8శాతం వసూలు చేస్తున్నారు. ప్రభుత్వమే ఆదుకోవాలి.. ఇటు ధర బాగా తగ్గిపోయింది. కేజీ ధర రూ. 20 ఉంటే గాని ఖర్చులు కూడా రావు. ప్రస్తుతం కేజీ రూ. 5 మాత్రమే పలుకుతోంది. ఈ పరిస్థితుల్లో నిమ్మరైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి.  రైతుల నుంచి నిమ్మకాయలు కొనుగోలు చేసిన కమీషను వ్యాపారులు, ట్రేడర్లకు అమ్ముతారు. మధ్యలో కొనుగోలు చేసి అమ్మినందుకుగాను రైతుల నుంచి 4 శాతం చొప్పున కమీషను వసూలు చేయాలి. కానీ నిమ్మకాయల మార్కెట్లో ఆ ప్రసక్తే కనిపించడం లేదు. కొంతమంది 6 శాతం, మరికొందరు 7 శాతం, ఇంకొందరు 8 శాతం పైబడి వసూలు చేస్తున్నారు. పది నుంచి 12 శాతం వసూలు చేస్తున్న సంఘటనలూ ఉన్నాయి. ఎప్పటి నుంచో మార్కెట్లో తిష్టవేసిన వ్యాపారులు రైతుల నుంచి అక్రమంగా వసూలు చేస్తున్నారు. ఒక శాతం చొప్పున ట్రేడర్లు చెల్లిస్తున్న సెస్సు సుమారుగా కోటిన్నర వరకు మార్కెట్టు కమిటీకి వస్తోంది. 4శాతం పైబడి అక్రమంగా వసూలు చేస్తున్న కమీషను రూ.6 కోట్ల నుంచి రూ.10 కోట్లు వరకు ఉంటుందనేది అంచనా. ఇక్కడ కొంతమంది రైతులను అడ్డంపెట్టుకుని ఈ-నామ్‌ విధానాన్ని అమల్లోకి రానీయకుండా చేసేశారు. చేసేది లేక రైతులు మిన్నకుండిపోతున్నారు. తమ పంట అమ్ముకునేందుకు మరో మార్గం లేకపోవడంతో వ్యాపారులు ఎంత కమీషను వసూలు చేసినా.. రైతులకు  అడిగే ధైర్యం లేకుండా పోయింది. మార్కెట్టు యార్డులోనే వ్యవసాయ మార్కెట్టు కమిటీ అధికారులు ఉంటారు. ఈ కమీషను వసూళ్ల దందాలను అడ్డుకునే ప్రయత్నాలు చేయడం లేదు. ఇటు ధర తగ్గిపోయి అటు కమీషను భారం పెరిగి రైతులు నలిగిపోతున్నారు. ప్రస్తుతం కేజీ నిమ్మకాయలు రూ. 5, రూ. 6 మధ్య పలుకుతున్నాయి. 50 కేజీల బస్తాకు రూ. 5 చొప్పున లెక్కవేస్తే రూ. 250 వస్తుంది. అందులో కోతకే బస్తాకు రూ. 150 చెల్లించాలి. రవాణా ఛార్జీ రూ. 50 చెల్లిస్తున్నారు. 8 శాతం చొప్పున కమీషను లెక్కవేస్తే రూ. 20లు, దిగుమతి కూలీ రూ. 8 చెల్లించాల్సి వస్తోంది. ఒక బస్తా వద్ద రైతుకు మిగిలేది రూ. 20. ఇలా నిత్యం దోచుకుంటున్నారు. ఇటీవల వరకు ధర కాస్త బాగుండడంతో రైతులు పెద్దగా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ధర దారుణంగా పడిపోవడంతో కమీషను అడ్డగోలుగా వసూలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
 

Related Posts