YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విదేశీయం

కోవిడ్ తో  కలల నగరాలు అతలాకుతలం

కోవిడ్ తో  కలల నగరాలు అతలాకుతలం

కోవిడ్ తో  కలల నగరాలు అతలాకుతలం
వాషింగ్టన్, న్యూఢిల్లీ, జూన్ 16,
న్యూయార్క్ , ముంబయి . . . ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిచెందిన నగరాలు. అమెరికా, భారత్ లోని ఈ నగరాలు ఆ యా దేశాలకు గుండెకాయల వంటివి. ఐక్యరాజ్యసమితి కేంద్ర కార్యాలయం న్యూయార్క్ నగరంలోనే కొలువుదీరింది. వివిధదేశాల రాయబారులు, విదేశాంగమంత్రులు, అధినేతల పర్యటనలతో న్యూయార్క్ నగరం ఎప్పుడూ సందడిగా ఉంటుంది. 24 గంటలుా ఇక్కడ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి. అందుకే దీనికి నిద్రలేని నగరంగా పేరొచ్చింది. అమెరికా ఆర్ధికవ్యవస్ధలో ఈ నగరం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక భారత్ లోని ముంబయి ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పేరుకు ఇది పశ్చిమ రాష్ట్రమైన మహారాష్ట్ర రాజధాని. కానీ దీనికి దేశ ఆర్ధికరాజధానిగా పేరుంది. రిజర్యుబ్యాంకు తో సహా పలు కేంద్రప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల కేంద్ర కార్యాలయాలు ఇక్కడ నుంచే పని చేస్తున్నాయి. అందువల్లే దీనికి ఢిల్లీని కాదని ఆర్ధిక రాజధానిగా పేరొచ్చింది. ఇప్పుడు కరోనా తాకిడికి న్యూయార్క్, ముంబయి నగరాలు తల్లడిల్లుతున్నాయి. ఈ నగరాల్లో కరోనా విలయతాండవం చేస్తోంది. ఈ పరిస్ధితి నుంచి ఈ నగరాలు సమీప భవిష్యత్తులో బయటపడే అవకాశాలు కనబడటంలేదు. ఇటు భారత్ లో ముంబయి, అటు అమెరికాలో న్యూయార్క్ ఈ మహమ్మారి నుంచి బయటపడే దారిలేక ఆందోళన చెందుతున్నాయి.కరోనా మరణాలతో న్యూయార్క్ నగరం మార్మోగుతోంది. జుాన్ 7 నాటికి న్యూయార్క్ లో మెుత్తం 3,07,810 పాజిటివ్ కేసులు నమెాదయ్యాయి. వీరిలో 84,408 మంది సురక్షితంగా ఆరోగ్యంతో తిరిగివచ్చారు. 30,401 మంది కన్నుముాశారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల కాలంలో కొత్తగా వెలుగుచూస్తున్న కేసులు,మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని న్యూయార్క్ గవర్నర్ ఆండ్ర్యుా క్యుమెా చెబుతున్నాప్పటికి క్షేత్రస్ధాయి పరిస్ధితి అందుకు అనుగుణంగా లేదన్న వాదనలు వినపడుతున్నాయి. న్యూయార్క్ నగరంలో మెుట్టమెుదట మార్చి 11 న కరోనా కేసు వెలుగు చూసింది. ప్రాధమిక దశలోనే నివారణచర్యలు చేపడితే పరిస్ధితి ఇంత తీవ్రంగా ఉండేదికాదు. నెలతిరిగే సరికి ఏప్రిల్ 7 నాటికి 590 మంది మరణించారు. రెండునెలలు తిరిగేసరికి అంటే జుాన్ 7 నాటికి మరణాల సంఖ్య వేలకు చేరుకుంది. నగర పరిస్ధితిపై మేయర్ బిలాడె బ్లాసియెా ఆవేదన వ్యక్తంచేశారు. గవర్నర్ ఆండ్రుా క్యుమెా డెమెుక్రటిక్ పార్టీ అయినందున తమ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే ఉద్దేశంతో నివారణ చర్యలు చేపట్టడంలో నిర్లక్షంగా వ్యవహరించారని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఆరోపిస్తున్నారు. ఎవరి ఆరోపణలు ఎలా ఉన్నప్పటికీ, పార్టీల తేడాలు ఎలా ఉన్నప్పటికీ కరోనా తో అంతర్జాతీయంగా న్యూయార్క్ నగరం ప్రతిష్ట దారుణంగా దెబ్బతినింది. ఇది నివాస యెాగ్యప్రాంతం కాదన్న అభిప్రాయం వ్యాప్తిచెందుతోంది.ఇక ముంబయి నగర పరిస్ధితి వేరు. పొట్టచేత పట్టుకుని బతుకు దెరువుకోసం లక్షలమంది ప్రజలు దేశంలోని వివిధప్రాంతాల నుంచి ఈ నగరానికివస్తుంటారు. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఇక్కడ ఎక్కువ. జనసాంద్రత కూడా ఎక్కువే. దేశవ్యాప్తంగా చుాస్తే కరోనా మరణాల్లో మహారాష్ట్ర మెుదటి స్ధానంలో ఉంది. ఇక రాష్ట్ర రాజధాని ముంబయి నగరం పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఇప్పటికే యాభై వేల కేసులు వెలుగుచుాశాయి. రెండు వేలకు మంది పైగా మరణించారు. రోగులతో వైధ్యశాలలు కిటకిటలాడుతున్నాయి. ఐసీ‍యూలు, వార్డులు రోగులతో నిండిపోతున్నాయి. మంచాల కొరతతో రోగులను నేలపైన పడుకోబెట్టి చికిత్స అలరిస్తున్నారు. వైరస్ వ్యాపిస్తుందన్న భయంతో మృతదేహాలను తీసుకువెళ్ళేందుకు సైతం బంధువులు ముందుకు రావడం లేదు. దీంతో ఆస్పత్రుల్లో శవాల గుట్టలు పేరుకుపోతున్నాయి. వాటిమధ్యనే రోగులకు చికిత్స అందించాల్పిన దయనీయ పరిస్ధితి నెలకొంది. బంధువులు ఇరుగుపొరుగువారు దుారం పెడతారన్న భయాలు, అద్దె ఇంట్లోకి మృతదేహాలను తీసుకువచ్చేందుకు యజమానులు అంగీకరించరన్న అనుమానాలు, వైరస్ తమకుా సోకుతుందన్న భయంతో కరోనాతో చనిపోయినవారి మృతదేహాలను వైద్యశాలల్లోనే వరిలేస్తున్నారు.దీంతో ముంబయి నగరంలోని కింగ్ మెమోరియల్ ఆసుపత్రి లో మృతదేహాల గుట్టలు పేరుకుపోతున్నాయి. కరోనా కేసులు కారణంగా సాధారణ కేసులను పరిశీలించే అవకాశం వైద్యులకు లభించడం లేదు. ఈ వైద్యశాల మార్చురీలో ఒకేసారి 27 శవాలను ఉంచే అవకాశం ఉంది. దీంతో స్ట్రెచర్ల పైనే మృతదేహాలను కారిడార్ లో ఇరువైపులా ఉంచుతున్నారు. ఆస్పత్రి ఉద్యోగుల సంఘనేత సంతోష్ ధూరీ ఆవేదన వ్యక్తంచేశారు. అవసరమైన పీపీఈలు లేక ఆరోగ్య సిబ్బంది ఇబ్బందులు పాలవుతున్నారు. ఆస్పత్రి లో సౌకర్యాలు లేమి వాస్తవమేనని రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ మంత్రి రాజేష్ తోపే అంగీకరించారు. ఆక్సిజన్ సరఫరాతో కుాడిన 10 వేల పడకల తక్షణ అవసరం ఉంది. నగరంలో కోవిడ్ రోగులకు సేవలు అందించే మరో ఆస్పత్రి ‘ సిమెాన్ ‘ ఆస్పత్రిలోనుా పరిస్ధితులు ఇందుకు భిన్నంగా ఏమీలేవు. వలస ప్రజానికం వల్ల నగరంలో కోవిడ్ కేసులు నానాటికి పెరుగుతున్నాయి. ‘ కలల నగరాన్ని కాళరాత్రి నగరంగా ‘ కరోనా మార్చిందని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. ఇలా చెప్పడం ఇబ్బందికరం అయినప్పటికీ ఇది అందరుా అంగీకరించాల్సిన చేదునిజం అనడంలో సందేహం లేదు.

Related Posts