YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 రఘరామకు నోటీసులు

 రఘరామకు నోటీసులు

 రఘరామకు నోటీసులు
ఏలూరు, జూన్ 16 
సొంత పార్టీ నాయకులపై సంచలన వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్న నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజుపై చర్యలకు పార్టీ అధిష్టానం రెడీ అయింది. వైసీపీ ఏడాది పాలనలో కుల రాజకీయం, అవినీతి, ఇసుక, ల్యాండ్ మాఫియా పెరిగిపోతున్నాయంటూ రఘురామ కృష్ణంరాజు గతకొంతకాలంగా బహిరంగ విమర్శలు చేస్తున్నారు. అలాగే సీఎం జగన్ చుట్టూ చేరిన కోటరీ.. కుల రాజకీయాలను ప్రోత్సహిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.ఎంపీ కృష్ణంరాజు వ్యాఖ్యలపై గుర్రుగా ఉన్న వైసీపీ అగ్రనేతలు క్రమశిక్షణా చర్యలకు రెడీ అవుతున్నట్టు సమాచారం. షోకాజ్ నోటీసులు జారీ చెయ్యాలని ఆ పార్టీ అధినేత జగన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎంపీ నుంచి సరైన జవాబు రాకపోతే పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోమన్న సంకేతాలు ఇచ్చారని విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.అంతకుముందు ఎంపీ రఘురామరాజుపై నరసాపురం ఎమ్మెల్యే ప్రసాదరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెంటనే స్పందించిన ఆయన.. తాను వైసీపీ ఎంపీగా గెలవడం నిజమని, అయితే పార్టీలోకి తనకు తానుగా రాలేదని, కాళ్లావేళ్లా బతిమిలాడితే వచ్చానన్నారు. అంతకుముందు వైసీపీ చేరమని పలువురు అడిగితే ఛీ కొట్టానని షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తే.. ఆయా కులాలకు చెందిన వారితో విమర్శలు చేయిస్తారని ఇది వైసీపీ సాంప్రదాయమని అన్నారు. దయచేసి కులాల మధ్య చిచ్చుపెట్ట వద్దని విజ్ఞప్తి చేశారు. జగన్ వల్ల పదవి రాలేదుముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చుట్టూ ఉన్న కోటరీ కులాల మధ్య చిచ్చుపెడుతోందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ చిన్న కులంలో చిచ్చుపెట్టొదంటూ వ్యాఖ్యానించారు. వైసీపీలో పదవులన్నీ సీఎం జగన్ చుట్టూ ఉండే కోటరీకి చెందిన కులస్తులకే దక్కుతాయన్నది అందరికీ తెలిసిన విషయమేనని చెప్పారు. సీఎం జగన్ దయ వల్లే పార్లమెంటు కమిటీకి చైర్మన్ పదవి దక్కిందని వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. తానకు సీఎం జగన్ వల్ల ఆ పదవి దక్కలేదని స్పష్టం చేశారు.పార్లమెంటులో మనకు ఉన్న ఎంపీలను బట్టి కమిటీ పదవులు దక్కుతాయని ఎంపీ కృష్ణంరాజు చెప్పారు. పార్లమెంటులో 24 డిపార్ట్ మెంట్ కమిటీలు, 11 పార్లమెంటరీ లోక్ సభ కమిటీలు ఉన్నాయని, లెక్కల ప్రకారం చూసుకుంటే వైసీపీకి ఒక్కటే చైర్మన్ పదవి వస్తుందని పేర్కొన్నారు. ఆ పదవి తనకు ఇవ్వాలని సీఎం జగన్‌ను తాను కోరినట్లు వెల్లడించారు. అయితే యథాప్రకారం రాష్ట్రంలో అన్ని పదవుల్లో ఎవరున్నారో అందరికీ తెలుసునని, దాని ప్రకారమే సీఎం జగన్ బిజినెస్ రూల్స్‌ను అతిక్రమించి మరీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఎన్నో పదవులతో పాటు పార్లమెంటరీ కామర్స్ కమిటీకి చైర్మన్‌గా నియమించారని వెల్లడించారు.ఇక పార్లమెంటులో తనకు ఉన్న పర్ఫామెన్స్‌ను బట్టి.. మా లోక్‌సభ స్పీకర్, మా పార్లమెంటరీ ఎఫైర్స్ మినిస్టర్, గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ కలిసీ మా పార్టీ కోటా అయిపోయినప్పటికీ.. వేరే వాళ్లకు చెందాల్సిన దాంట్లో నాకు పదవి ఇచ్చారని ఎంపీ కృష్ణంరాజు వ్యాఖ్యానించారు. మా పార్టీకే రెండో ఇచ్చారని మీరు అనుకోవచ్చని, మా ప్రసాదరాజు కూడా ఇలాగే అనుకుని జగన్ దయ వల్ల వచ్చిందని అనుకోవచ్చని ఎద్దేవా చేశారు. దీన్ని ప్రజలు కూడా అదే నిజమని అనుకుంటారని భావించి ఈ క్లారిఫికేషన్ ఇస్తున్నానని పేర్కొన్నారు. చివరిగా మా చిన్న కులంలో చిచ్చు పెట్టి, సం‘కుల’ రాజకీయం చేయవద్దని సీఎం కోటరీకి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కోరుతున్నట్లు వ్యాఖ్యానించారు.

Related Posts