YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

చేనేతకు కరోనా కష్టాలు

చేనేతకు కరోనా కష్టాలు

చేనేతకు కరోనా కష్టాలు
కరీంనగర్, జూన్ 16,
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వస్త్ర పరిశ్రమలో పాలిస్టర్‌ ఉత్పత్తి అయ్యే 26వేల మరమగ్గాలపై సుమారు 16వేల మంది కార్మికులు 'ఉపాధి' పొందు తున్నారు. పెట్టికోట్స్‌, ఇతర వస్త్రాలకు సంబంధిం చిన కాటన్‌ ఉత్పత్తి అయ్యేమగ్గాలు మరో 2వేల వర కు ఉన్నాయి. యజమానులు, ఆసాములు, కార్మికులు కలిపి మూడెంచల వ్యవస్థగా ఉండేసిరిసిల్లలో మాక్స్‌ సొసైటీ కింద100, చిన్నతరహా పరిశ్రమల కింద120 గ్రూపులుగా కార్మికులు నమోద య్యారు. పాలిస్టర్‌ ఉత్పత్తులపైనే ఆధారపడే వారందరికీ మార్కెట్‌ ఆధారితంగానే పనులు దొరికేవి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నాలుగేండ్లుగా ఇస్తున్న బతుకమ్మ చీరెల ఆర్డర్లకు తోడు ప్రయివేటుగా పాలిస్టర్‌ ఉత్పత్తులతో కొంత ఉపాధి దొరికేది.ఈ ఏడాది రూ.330కోట్ల ఆర్డర్‌తో 6కోట్లా 20లక్షల మీటర్ల బతుకమ్మ చీరెల ఉత్పత్తి ఆర్డర్‌ను సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అప్పగించింది. ఇక్కడి పరిశ్రమలోని 26వేల మగ్గాల్లో ఒక్కో మగ్గంపై రోజుకు 50మీటర్ల చీర ఉత్పత్తి అవు తుండగా రోజుకు 13లక్షల మీటర్ల గుడ్డ తయారవుతుంది. ఈ లెక్కన 6కోట్లా 20లక్షల మీటర్ల చీరెల ఉత్పత్తికి 50రోజులు పడుతుంది. సెలవు దినాలు సహా సర్కారిచ్చిన చీరెల ఆర్డర్‌కు 60రోజుల(రెండు నెలలు) పనిమాత్రమే కార్మికులకు దొరుకుతుంది. జనవరిలో ఆర్డర్‌ ఇవ్వగా పనులు మొదలయ్యేసరికి మార్చి వచ్చింది. ఈలోపు కరోనా వైరస్‌ వ్యాప్తితో వచ్చిన లాక్‌డౌన్‌ కారణంగా రెన్నెళ్లకుపైగా మగ్గాలు నిలిచిపోయాయి. లాక్‌డౌన్‌ సడలింపులతో అరకొరగా వచ్చిన యారన్‌ దిగుమతులతో సగం మగ్గాలపైనే ఒక షిప్టు పద్ధతిలోనే పనులు నడుస్తున్నాయి.సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో కరోనా దెబ్బకు పాలిస్టర్‌ ఉత్పత్తికి పూర్తిగా బ్రేక్‌ పడింది. మార్కెట్‌లో ఎగుమతుల్లేక ఇప్పటికే కొన్ని కోట్ల మీటర్ల పాలిస్టర్‌ వస్త్రం యజమానులు, ఆసాముల వద్ద నిల్వలు ఉండిపోయాయి. ఫిబ్రవరి చివరి నుంచి కొత్తగా పాలిస్టర్‌ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. మిగిలిన బతుకమ్మ ఆర్డర్‌కు సైతం యారన్‌ దిగుమతి సరిగా లేక 26వేల మగ్గాలకుగాను 12వేల మగ్గాలపైనే ఉత్పత్తి సాగుతోంది. మిగతా సగం మగ్గాలపై ఆధారపడ్డ కార్మికులు మూన్నెళ్లుగా పస్తులుంటున్నారు. మరోవైపు 'బతుకమ్మ' ఆర్డర్‌పై ఆశతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన యజమానులు సైతం ఇక్కడ 3వేల మగ్గాలు ఏర్పాటు చేశారు. వారికి సొసైటీలో సభ్యత్వంలేక బతుకమ్మ ఆర్డర్లు రాలేదు. దీంతో వీటిపై ఆధారపడ్డ 600మందికి పని లేకుండా పోయింది. 'బతుకమ్మ' ఆర్డర్‌ సైతం మరో నెల రోజుల్లో పూర్తికానుండటంతో సిరిసిల్లలోని మరమగ్గాలన్నీ ఆర్డర్లు, ఉత్పత్తుల్లేక పూర్తిగా మూగబోనున్నాయి.

Related Posts