కోదాడలో మద్యం స్వాధీనం
కోదాడ, జూన్ 16
సూర్యాపేట జిల్లాలోని బోర్డర్ చెక్ పోస్టులో కోదాడ పోలీసులు 7లక్షల విలువైన మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో మద్యం రేట్లు ఆకాశాన్ని అంటుతుండడంతో అక్రమార్కులు తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మద్యం కొనుగోలు అక్రమంగా ఏపీకి రవాణా చేస్తున్నారు, తాజాగా సూర్యాపేట లోని ఓ వైన్ షాపు నుండి 7లక్షల విలువైన మద్యాన్ని ఎవరికి అనుమానం రాకుండా కొరియర్ వాహనంలో తరలిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు, సోమవారం అర్ధరాత్రి మద్యం తరలిస్తున్న వాహనాన్ని కోదాడ రూరల్ పోలీసులు పట్టుకున్నారు అందుకు కారకులైన ఏపీకి చెందిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని మద్యాన్ని,వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఇన్స్పెక్టర్ శివరామిరెడ్డి తెలిపారు. , మద్యం పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై సైదులు ఇతర సిబ్బందిని ఆయన అభినందించారు.