YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

 అధికారిణిపై జడ్పీ సమావేశం మండిపాటు అదిలాబాద్

 అధికారిణిపై జడ్పీ సమావేశం మండిపాటు అదిలాబాద్

 అధికారిణిపై జడ్పీ సమావేశం మండిపాటు
అదిలాబాద్ జూన్ 16
ఆదిలాబాద్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జడ్పీఛైర్మన్ రాథోడ్ జనార్దన్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్బంగా వైద్య ,వ్యవసాయ శాఖలతో పాటు ఇతర అంశాలపై  చర్చించారు. . తెలంగాణ రాష్ట్రప్రభుత్వం  తీసుకున్న రైతు పథకాలను సక్రమంగా అందించేలా అధికారులు చూడాలని జడ్పీఛైర్మన్ రాథోడ్ జనార్దన్  కోరారు.  సభ్యులు మాట్లాడుతూ ప్రతి మీటింగ్ లో అధికారులు గైర్హాజరు అవుతున్నారని,  వారిపై చర్యలు తీసుకోవలని కోరారు. అదే విధంగా జిల్లా వ్యవసాయ అధికారి ఆశకుమారి  ప్రతి సంవత్సరం జూన్ మాసం లో 3 నెలలు సెలవుపై వెళుతున్నారని , ఆ సమయంలో లో రైతులకు విత్తనాలు , ఎరువుల సమస్య ఉంటుందని అన్నారు. సదరు అధికారి  కావాలనే  2018 నుండి ఇప్పటివరకు ఇలానే ఇలాగే చేస్తుందని ఆమె పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసి పభుత్వనికి సరెండర్ చేయాలని సబ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఇక సోయా విత్తనాలు రైతులకు అందడం లేదన్న సభ్యుల ప్రశ్నలకు ఇంఛార్జి వ్యవసాయ అధికారి సమాధానం ఇస్తు ఇకపైన సోయా విత్తనాలు జిల్లాకు వచ్చే అవకాశాలు లేవని అన్నారు.  ఎమ్మెల్యే జోగురామన్న ఆ అధికారి పైన కోపంతో మండిపడ్డారు. మీలాంటి అవగాహన లేని అధికారులవల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని అన్నారు. సోయా విత్తనాలు రాలేదని మీకు ఎవరు చెప్పారు అని అసహనం వ్యక్తం చేశారు. కనీస సమాచారం లేకుండా సమావేశానికి అధికారులు  వస్తున్నారని దీని పైన కలెక్టర్ గారు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి ఎంపి సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు  జోగు రామన్న, రాథోడ్ బాపురావు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Related Posts