YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

లాక్ డౌన్ సమయంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి

లాక్ డౌన్ సమయంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి

లాక్ డౌన్ సమయంలో ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి
నెల్లూరు జూన్ 16
కోవిద్ 19 ఈ నేపథ్యంలో లో ప్రజల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలతో అమలవుతున్న లాక్డౌన్ కాలంలో స్థానిక 36వ డివిజన్ పేద ప్రజలను ప్రభుత్వం ఆదుకోవాలి ఉందని, స్థానిక డివిజన్ సచివాలయ కార్యదర్శి కి నెల్లూరు గ్రామీణ సిపిఎం నాయకులు మంగళవారం వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా నెల్లూరు గ్రామీణ సిపిఎం కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రాణాంతక కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక సహాయం కింద 7500 రూపాయలు నగదు చొప్పున ఆరు నెలల కాల పరిమితికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రతి కుటుంబానికి 10 కేజీలు బియ్యం వంతెన ఆరు నెలల కాలానికి ఇవ్వాల్సి ఉందన్నారు. ప్రస్తుత లాక్ డౌన్ సమయంలో పట్టణ ఉపాధి హామీ సదుపాయం కల్పించి, ప్రతి కుటుంబానికి పనిదినాలను కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న ఇల్లు లేనివారికి ఇంటి నివేశన స్థలాలు మంజూరు సమయంలో 36వ డివిజన్ పరిధిలో ఇంటి స్థలాలు లేని ప్రతి పేదవాడికి ఇంటి స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక డివిజన్ సిపిఎం ఇంచార్జి ఎన్. మాలకొండయ్య, స్థానిక సిపిఎం నాయకులు జి శంకర్, వై చరణ్, బి కోటయ్య, ఎం. మధు , వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Posts