ఇంటర్ ఫలితాల విడుదలకు అంతా సిద్దం
హైదరాబాద్ జూన్ 16,
తెలంగాణ ఇంటర్ ఫలితాలను విడుదల చేసేందుకు రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు రంగం సిద్దం చేస్తోంది. ఇటీవలే విద్యాశాఖ అధికారుల కసరత్తుతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాల ప్రక్రియ పూర్తయింది. ప్రస్తుతం మరోసారి రిజల్ట్స్ ప్రక్రియను అధికారులు పరిశీలిస్తున్నారు. మంగళవారం ఫలితాలపై ఇంటర్ బోర్డు ప్రభుత్వానికి నివేదికను సమర్పించింది. దీనితో ఈ నెల 18న ఫలితాల విడుదలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. స్కానింగ్తో పాటు ఇతర పాలనపరమైన ఏర్పాట్లన్నీ కూడా రెండు రోజుల క్రితమే పూర్తయ్యాయి. మొదట, ద్వితీయ సంవత్సరం రిజల్ట్స్ను ఒకేసారి విడుదల చేస్తారని సమాచారం.