ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఆసరా
- : జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్
కడప, జూన్ 16
ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ బాధిత కుటుంబాలకు ఉద్యోగ ఉపాధి కల్పన ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆసరా కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇందులో భాగంగా తాజాగా.. రంపతోటి ఈశ్వరమ్మ కడప ప్రభుత్వ ఐటిఐ కార్యాలయంలో టైపిస్టుగా ఉద్యోగ అవకాశాన్ని పొందింది. ఈ మేరకు సోమవారం జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ఆమెకు ఉద్యోగ నియామక పత్రాన్ని అందజేశారు.హత్యకు గురయిన కలసపాడు మండలం, శంఖవరం గ్రామానికి చెందిన రంపతోటి రామయ్య కుటుంబానికి ఆసరాగా ఆయన కుమార్తె రంపతోటి ఈశ్వరమ్మకు ఈ ప్రభుత్వ ఉద్యోగాన్ని కల్పించించడం జరిగింది.గతంలో 2019 లో కూడా ఎస్సి,ఎస్టీ అట్రాసిటీ బాధిత కుటుంబానికి ఆసరాగా కుటుంబంలో ఒకరికి చొప్పున ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. పులివెందులలోని నగిరిగుట్ట సున్నం బట్టీ వీధిలోని పి.నాగార్జున అగ్రవర్ణాల వారి దాడిలో మృతి చెందగా.. ఆయన కుమార్తె పి.మల్లేశ్వరికి రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినెట్ గా ఉద్యోగాన్ని కల్పించడం జరిగింది. సిద్దవటం మండలం, పెద్దపల్లి దిగువ ఎస్సి కాలనికి చెందిన జి.బాలయ్య ఆగ్రవర్ణాల వారి దాడిలో తీవ్ర గాయలపాలై మృతి చెందగా.. ఆయన కుమారుడు బాలయ్యకు జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఆఫీస్ సబార్డినెట్ గా ఉద్యోగాన్ని కల్పించడం జరిగింది. అలాగే... జమ్మలమడుగు మండల కేంద్రం బీసీ కాలనీ కి చెందిన మునగాల రవి అగ్రవర్ణ వర్గీయుల చేతిలో మృతి చెందగా.. ఆయన భార్య గంజి పద్మావతికి ఆర్జేడీ కార్యాలయం, ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్, కడప నందు టైపిస్టుగా ఉద్యోగ అవకాశాన్ని కల్పించడం జరిగిందని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.