YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సస్పెండ్ కోసమేనా ప్రయత్నం

సస్పెండ్ కోసమేనా ప్రయత్నం

 

సస్పెండ్ కోసమేనా ప్రయత్నం
ఏలూరు, జూన్ 17
బ్యాంకులకు రుణాలు ఎగవేసిన వారంతా బీజేపీ చెంతకు చేరుతున్నారు. తమ వ్యాపారాలను నిర్వహించుకోవడం కోసం వారు కేంద్రంలో అధికార పార్టీని ఆశ్రయించడం ఆనవాయితీగా వస్తుంది. గతంలో కావూరి సాంబశివరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్ వంటి వారు బ్యాంకులకు రుణాలు ఎగవేసిన కేసుల్లో ఉన్నారు. తాజాగా వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు కూడా ఆ ఖాతాలోనే చేరిపోయారు. రఘురామ కృష్ణంరాజు వైసీపీలో కంఫర్ట్ గా ఉండాలి. ఎందుకంటే వైసీపీ కూడా బీజేపీతో స్నేహాన్నే కోరుకుంటుంది. బీజేపీ కూడా వైసీపీని పెద్దగా టార్గెట్ చేయడం లేదు. టీడీపీని ఏపీలో లేకుండా చేయడమే ప్రస్తుతం బీజేపీ ముందున్న లక్ష్యంగా కన్పిస్తుంది. అయితే రఘురామ కృష్ణంరాజు మరిన్ని ప్రయోజనాలు ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. తనకు కేంద్రంలో కీలక పదవి కోసం రఘురామ కృష్ణంరాజు ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.దీంతో పాటు తన బ్యాంకు రుణాల ఎగవేత కేసు నుంచి కూడా తప్పించుకోవడానికే ఆయన వైసీపీ పై విమర్శలు చేస్తున్నారని చెబుతున్నారు. 2018 లోనే బ్యాంకుల నుంచి నోటీసులు వచ్చాయి. కేసు నమోదయింది. వైసీపీలోనే కొనసాగితే తనకు వ్యక్తిగతంగా ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. ఆయన సాధారణ ఎంపీగానే కొనసాగాల్సి ఉంటుంది. ఎందుకంటే అక్కడ విజయసాయరెడ్డి, మిధున్ రెడ్డి వంటి నేతల డామినేషన్ ఉంటుంది. వారిని కాదని తనకు భవిష్యత్తులో రాజకీయంగా ఎలాంటి ప్రయోజనం ఉండదని భావించిన రఘురామ కృష్ణంరాజు వైసీపీపై కాలుదువ్వుతారంటున్నారు.అందుకోసమే రఘురామ కృష్ణంరాజు తనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నారు. పార్టీ నుంచి సస్పెండ్ కు గురైతే నేరుగా బీజేపీ కండువా కప్పేసుకోవచ్చన్నది రఘురామ కృష్ణంరాజు ఆలోచనగా ఉంది. అందుకే నిన్న మొన్నటి వరకూ వైసీపీ సర్కార్ పై విమర్శలు చేసి, జగన్ ను ప్రశంసించిన రఘురామ కృష్ణంరాజు నేడు జగన్ పై నేరుగా విమర్శలు చేస్తున్నారు. తాను జగన్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడి గెలవలేదని కూడా రఘురామ కృష్ణంరాజు అన్నారంటే ఆయన పార్టీ నుంచి వైదొలగేందుకే నిర్ణయించుకున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. బస్తీమే సవాల్ ఐదుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే తాను రాజీనామా చేస్తానని వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. మంత్రి పేర్ని నానితో సహా తనను అందరూ విమర్శించే వారని రఘురామ కృష్ణంరాజు అన్నారు. కొట్టు సత్యనారాయణ ఒక ఇసుక దొంగ అని అన్నారు. ఇళ్ల స్థలాలతో పాటు ఇసుక అక్రమాలు చేశారన్నారు. కొట్టు సత్యనారాయణ జాతకం ఇప్పుడు బయటపడుతుంది. సత్యనారాయణ గురించి ఆయన మేనల్లుడే చెబుతారన్నారు. ఎవరైనా తనను విమర్శిస్తే బీ కేర్ ఫుల్ అని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. జగన్ బొమ్మ పెట్టుకుని ఎవరు గెలిచారో? నా బొమ్మ పెట్టుకుని ఎవరు గెలిచారో తేల్చుకుందామన్నారు. చూసుకుందామంటే చూసుకుందామని రఘురామ కృష్ణంరాజు సవాల్ విసిరారు. 

Related Posts