ట్రూనాట్ ద్వారా పాఠాలు
విజయవాడ, జూన్ 17,
కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులకు సైతం ప్రత్యేకంగా పరీక్షలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ట్రూనాట్ ల్యాబ్ లు ఏర్పాటు చేసేందుకు సంకల్పించింది. దీంతో పాటు విద్యార్థులకు అన్ లైన్ ద్వారానే పాఠాలు భోదించాలని నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి తొందర్లోనే ఉత్తర్వులు వెలువడనున్నట్టు సమాచారం.కరోనా నేపధ్యంలో ఏపీ ఉన్నత విద్యలో సమూల మార్పులు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఇందులో భాగంగానే విద్యాసంస్థల పునరుద్దరణ, పరీక్షల నిర్వహణ విషయంలో కొత్త అకాడెమిక్ క్యాలెండర్‌ను రాష్ట్ర విద్యాశాఖ రూపొందించినట్లు తెలుస్తోంది. ఏపీలోని విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించడం కోసం రాష్ట్రవ్యాప్తంగా 14 చోట్ల ట్రూనాట్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారని సమాచారం.అసెంబ్లీ మరోసారి ఆమోదం అటు వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇక నుంచి 20 శాతం పాఠాలను ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. డిజిటల్ లో బోధించే కంటెంట్ రూపకల్పన కోసం ప్రత్యేక విభాగాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారట. కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా విద్యాసంస్థల పునః ప్రారంభంపై శ్రద్ధ తీసుకుంటున్నామని.. వర్సిటీల్లో ఉండే మైక్రోబయాలజీ విభాగాలను కూడా బలోపేతం చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. కాగా, ఈ అకాడెమిక్ ఇయర్ (2020-21) నుంచి ప్రవేటు డిగ్రీ కళాశాలల్లో ఒకే తరహా ఫీజు విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేస్తున్నట్టు సమాచారం.