YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

 రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..

 రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది..

 రాజస్థాన్ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది...
అశోక్ కు పదవీ గండం
జైపూర్, జూన్ 17
అశోక్ గెహ్లాత్ కు కంటి మీద కునుకు లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పటికే గుజరాత్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను రాజస్థాన్ లో క్యాంప్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాజస్థాన్ లోనూ బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ ను ప్రారంభించింది. దీంతో అశోక్ గెహ్లాత్ ఆందోళన చెందుతున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర జరుగుతుందని ఆయన బహిరంగ ఆరోపణలు చేస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం ఆపరేషన్ ను ఆపడం లేదంటున్నారు.వరసగా మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని బీజేపీ చవి చూసింది. కర్ణాటకలో పథ్నాలుగు నెలల తర్వాత అక్కడ అధికారంలోకి రాగలిగింది. ఇక మధ్య ప్రదేశ్ లోనూ ఇటీవల అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ముఖ్యనేత జ్యోతిరాదిత్య సింధియాను ఆకర్షించడంంతో కమలనాధుల పని సులువయింది. ఆయన వెంట 22 మంది ఎమ్మెల్యేలు రావడంతో అధికారం సులువుగా సాధ్యమయింది.ఇక రాజస్థాన్ పై బీజేపీ కన్నేసింది. రాజస్థాన్ లో అధికారంలో కన్నా రాజ్యసభ లో బలం పెంచుకోవడమే ఇప్పుడు బీజేపీ ప్రధానంగా దృష్టి పెట్టిందని చెప్పాలి. తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ సంచలన ప్రకటన చేశారు. ఒక్కో ఎమ్మెల్యేకు 25 కోట్లు ఎర వేస్తున్నారని అశోక్ గెహ్లాత్ ఆరోపించారు. రాజ్యసభ ఎన్నికల్లో రాజస్థాన్ లో కాంగ్రెస్ కు రెండు, బీజేపీకి ఒక స్థానం దక్కుతుంది. కానీ బీజేపీ రెండు స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించడం ఇప్పుడు అనుమానాలకు తావిస్తుంది.కేవలం రాజ్యసభ స్థానాలనే కాకుండా అధికారాన్ని కూడా దక్కించుకునే ప్రయత్నాలు మొదలు పెట్టారంటున్నారు. రాజస్థాన్ లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలకు గాను 98 నుంచి మాత్రమే కాంగ్రెస్ నుంచి గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ కు కూడా కాంగ్రెస్ చేరకోలేదు. అయితే ఇక్కడ సీపీఎం, ఆర్ఎల్డీ సభ్యుల మద్దతుతో పాటు బీఎస్పీని తన పార్టీలో విలీనం చేసుకుంది. బీజేపీకి 80 మంది సభ్యులు ఉన్నారు. మరో 20 మంది సభ్యుల అవసరం అవుతుంది. రాజస్థాన్ కాంగ్రెస్ నేతల్లో ఆందోళన కల్గిస్తుంది. అయితే యువనేత సచిన్ పైలెట్ కాంగ్రెస్ వైపు ఉండటం కొంత ఊరట కల్గించే అంశమనే చెప్పాలి.

Related Posts