YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

పత్తిపైనే మోజు

పత్తిపైనే మోజు

పత్తిపైనే మోజు
పంట మార్పిడికి దూరంగా రైతాంగం
మెదక్, జూన్ 17
ప్రకృతి వైపరీత్యాలు, పెట్టుబడులు, శ్రమ, కూలీల కొరత తదితరాలేవైనా ఆరుతడి పంటలపై ఆధారపడిన రైతుల్లో అధిక శాతం తెల్లబంగారంని సాగు చేయడానికి మోజు చూపిస్తున్నారు. దాదాపుగా రెండు దశాబ్దాల కాలంగా పంట మార్పిడి విధానానికి అన్నదాతలు స్వస్తి చెప్పి ఒకే రకమైన పంటను సాగు చేస్తున్నారు. దీంతో విలువైన భూములు సైతం భూసారం కోల్పోయి నిస్సారమవుతున్నాయని వ్యవసాయ శాస్తవ్రేత్తలు ఆందోళన చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం సైతం పత్తి పంటను సాగు చేయకుండా ఇతర ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసుకోవాలని వ్యవసాయ శాఖ ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తోంది. పత్తికి సంబంధించిన ఎలాంటి సబ్సిడీలను కూడా ప్రభుత్వం అందించడం లేదు. అయినప్పటికీ వేలాది హెక్టార్లలో రైతులు పత్తి పంటనే సాగు చేస్తున్నారు. ఒకప్పుడు అన్నిరకాల ఆహార పంటలతో సస్యశ్యామలంగా కనిపించి పంట పొలాలు నేడు కనుచూపు మేరలో పత్తి పంటతోనే దర్శనమిస్తున్నాయి. పత్తి పంటకు మాదిరిగా ఇతర పంట దినుసులకు గిట్టుబాటు ధర రావడం లేదన్నది వ్యవసాయదారులు వాదన వినిపిస్తున్నారు. అడవి పందుల బెడద కారణంగా ఇతర పంటలను సాగు చేయడానికి సాహసం చేయడం లేదని రైతన్నలు వాపోతున్నారు. పత్తి పంటను సైతం ఒక్కోసారి అడవి పందులు ధ్వంసం చేస్తుంటాయని, అయినా వాటి దాడిని తట్టుకుని పత్తి ఎదుగుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో కొత్తగా ఏర్పాటైన సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల పరిధిలో విస్తారంగా పత్తిని సాగు చేస్తున్నారు. సాగునీటి వనరులు ఉన్న మెదక్ జిల్లాలో ఎక్కువ శాతం వరి సాగు చేస్తుండగా, ఆయా ప్రాంతాల్లో పత్తిని సాగు చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 50 వేల హెక్టార్లకు మించి పత్తిని సాగు చేస్తున్నారు. సిద్దిపేట జిల్లాలోని గజ్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో పత్తి సాగుపై రైతులు ఆసక్తిని కనబరుస్తున్నారు. పత్తి పంటను పరిరక్షించుకోవడానికి రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడకం వల్ల పర్యావరణ సమతుల్యత లోపించడమే కాకుండా, భూసారం పూర్తిగా దెబ్బతింటుందని శాస్తవ్రేత్తలు ఎన్నిరకాల హెచ్చరికలు చేసినా పట్టించుకోవడం లేదు. మృగశిరకార్తె ప్రవేశించగానే రైతులు పంటల సాగుపై దృష్టి సారించి పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. దుక్కులు దున్ని విత్తనాలు విత్తడానికి సిద్ధం చేసి పెట్టుకున్న రైతులు విత్తనాలు విత్తడానికి సిద్ధమవుతున్నారు. తొలకరి వర్షాలు కురియకుండానే పొడి మట్టిలోనే విత్తనాలు విత్తుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో నకిలీ పత్తి విత్తనాల బాగోతం వెలుగులోకి వచ్చింది. ప్రకృతి వైపరీత్యాలు, నకిలీ విత్తనాలు, రసాయన ఎరువులకు పెట్టుబడులు అన్నింట్లో భారం పెరిగినా రైతులు మాత్రం పత్తి సాగును విస్మరించడం లేదుఈ విషయంలో గ్రామాల్లో కట్టుదిట్టమైన నిబంధనలు విధించి పత్తి సాగును చేయకుండా రైతుల్లో పూర్తిస్థాయి చైతన్యం తీసుకువస్తేకానీ భవిషత్తులో వ్యవసాయ మనుగడను కొనసాగించలేమన్న ఆందోళనను శాస్తవ్రేత్తలు వ్యక్తం చేస్తున్నారు.

Related Posts