YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..

అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..

అయ్యన్న పాత్రుడిపై నిర్భయ కేసు..
విజయవాడ జూన్ 17 
తప్పులు చేస్తే తిప్పలు తప్పవన్న విషయాన్ని చాలామంది రాజకీయ నేతలు మర్చిపోతుంటారు. దీంతో.. కొత్త తలనొప్పుల్ని తెచ్చి పెట్టుకుంటారు. విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి.. టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడి వ్యవహారం ఈ కోవలోకే వస్తుంది. తన నోటి దూలతో కేసు కష్టాల్ని తెచ్చుకున్నారని చెప్పాలి. తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే క్రమంలో గీత దాటకూడదన్న విషయాన్ని మర్చిపోయారు. దీంతో.. భారీ కేసు ఆయన ఖాతాలో బుక్ అయ్యింది. నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణిని అసభ్యంగా దూషించిన కేసులో ఆయన బుక్ అయ్యారు. నిర్భయ చట్టం కింద ఐపీసీ సెక్షన్ 354ఎ(4) 500 504 505(1)(బి) 505(2) 506 509 కింద కేసును నమోదు చేశారు.ఇంతకీ అయ్యన్న మీద కేసు పెట్టే వరకూ విషయం ఎందుకు వెళ్లింది? దాని వెనకున్న కారణం ఏమిటన్నది చూస్తే.. స్థానిక మున్సిపల్ కౌన్సిల్ మాల్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో అయ్యన్నపాత్రుడి తాత లత్సాపాత్రుడు ఫోటోను అధికారులు తీసి ఛైర్మన్ గదిలోకి మార్చారు. తన తాత ఫోటోను యథాస్థానంలో ఉంచాలన్నది అయ్యన్న పాత్రుడి డిమాండ్.హాల్ కు రంగులు వేస్తున్న నేపథ్యంలో ఫోటోను లోపల పెట్టామని.. పనులు పూర్తైన వెంటనే యథాతధస్థానంలో ఉంచుతామని పేర్కొన్నారు. ఈ అంశంపై నిరసన చేస్తున్న అయ్యన్న పాత్రుడితో మున్సిపల్ కమిషనర్ తోట కృష్ణవేణి చెప్పారు. ఈ సందర్భంగా నోరు జారారు అయ్యన్న. ఫోటో మార్చే అధికారం కమిషనర్ కు ఎవరిచ్చారన్న అయ్యన్న.. ఎమ్మెల్యేకు ఆమె తొత్తుగా మారిందన్నారు. పోలీసులు.. పెద్దల మధ్య ఇచ్చిన మాట ప్రకారం నెల రోజుల్లో ఫోటోను యథాతధ స్థానంలో ఉంచని పక్షంలో కమిషనర్ బట్టలు ఊడదీసే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు/.ఈ సందర్భంగా ఆయన నోటి వెంట వచ్చిన మాటలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత కోపం వస్తే మాత్రం.. అంతలా నోటికి పని చెప్పాలా? అని ప్రశ్నిస్తున్నారు. ‘‘కమిషనర్ ఆడ ఆఫీసర్ అయిపోయింది. అదే మగవాడైతే వేరేలా ట్రీట్ మెంట్ ఉండేది’’ అంటూ నోరు జారారు.  ఒక మహిళా అధికారి పట్ల అంత అనుచితంగా మాట్లాడిన అయ్యన్నపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన మాటలతో నొచ్చుకున్న కమిషనర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో.. అయ్యన్నపై నిర్భయ కేసు నమోదు చేశారు.

Related Posts