YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆరోగ్యం దేశీయం

హోమ్ హెల్త్‌‌కేర్ బెనిఫిట్ ప్రవేశపెట్టిన ఐసిఐసిఐ లాంబార్డ్

హోమ్ హెల్త్‌‌కేర్ బెనిఫిట్ ప్రవేశపెట్టిన ఐసిఐసిఐ లాంబార్డ్

హోమ్ హెల్త్‌‌కేర్ బెనిఫిట్ ప్రవేశపెట్టిన ఐసిఐసిఐ లాంబార్డ్
          ఆరోగ్య బీమా పాలసీలలో మరిన్నిక్రొత్త ప్రయోజనాలు 
ముంబయి, జూన్ 17
భారతదేశపు అతి పెద్ద ప్రైవేట్ రంగ నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ ఐసిఐసిఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్, కరోనా వైరస్ మహమ్మారి నేపధ్యంలో తన హెల్త్ ఇండెమ్నిటీ వినియోగదారుల కొరకు అనేక అఫర్లను విడుదల చేసింది. ఇవి సంస్థ యొక్క ప్రస్తుత ఆరోగ్య బీమా అందిస్తున్న సంపూర్ణ ఆరోగ్య బీమా వంటి ఆఫర్లను మరింత ప్రయోజనకరంగా చేస్తాయి. కోవిడ్-19 మహమ్మారి మరియు దాని కొరకు విధించిన లాక్‌‌డౌన్ కారణంగా వినియోగదారులు ఎదుర్కొన్న సవాళ్ళను దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు ప్రయోజనాలు మరియు సడలింపులు అందించబడుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వినియోగదారుల అనుభవం మరియు ప్రయోజనాలను మరింత అధికం చేయాలని కృషి చేస్తున్నాము. ఈ కార్యక్రమం ఐసిఐసిఐ లాంబార్డ్ యొక్క ‘నిభాయే వాదే’తత్వానికి అనుగుణంగా ఉండి తన వినియోగదారుల కొరకు వారి అవసరతలో అదనపు శ్రద్ధ వహిస్తుంది. ఐసిఐసిఐ లాంబార్డ్, జీఐసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,  సంజీవ్ మంత్రి వ్యాఖ్యానిస్తూ, “ఐసిఐసిఐ లాంబార్డ్ వద్ద, మా వినియోగదారులకు అవసరతలో ఉన్నప్పుడు వారి చేయిపట్టుకోవడాన్ని మేము విశ్వసిస్తాము.  కోవిడ్-19 మహమ్మారి క్రొంగొత్త సవాళ్ళను విసరడం కొనసాగుతుండగా, మా వినియోగదారులకు క్రొత్తగా తలెత్తే అవసరాలను ప్రభావవంతంగా తీర్చగలగడానికి మా ఆరోగ్య బీమా పాలును మరింత పూరించడం మాకు ఎంతో ప్రాధాన్యమైన అంశంగా తోచింది. ఏ అదనపు ధర లేకుండా అందించబడే ఈ అదనపు ప్రయోజనాలు మా వినియోగదారులు వారి ఆరోగ్య బీమా వర్తింపు నుండి గరిష్ట ప్రయోజనాన్ని పొందుకునేలా ఛేయగలుగుతాయి”అని అన్నారు. కోవిడ్-19 మొదలైనప్పటి నుండి తన వినియోగదారులకు ప్రయోజనాన్ని చేకూర్చడానికి ఐసిఐసిఐ లాంబార్డ్ పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఒక ప్రత్యేక ‘కోవిడ్-19 ప్రొటెక్షన్ కవర్’ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్లో భాగంగా, ఇన్సూరెన్స్ క్లెయిమ్ పొందడం కొరకు వినియోగదారులు కచ్చితంగా హాస్పిటల్‌‌లో చేరాల్సిన అవసరం లేకుండా ఇంటివద్దనే చిత్సను పొందవచ్చు.ఇది వారికి వచ్చిన ఏదైనా అస్వస్థతకు హాస్పిటల్‌‌లో చేరకుండా భౌతిక దూరాన్ని పాఠిస్తూ ఇంటివద్దనే సురక్షిత వాతావరణంలో చికిత్స పొందాలనుకునే వినియోగదారులకు ప్రాముఖ్యంగా ప్రయోజనం చేకూరుస్తుంది.  ఇంకా, సంస్థ తన వినియోగదారులందరికీ వెబ్‌‌సైట్, మొబైల్ మరియు యాప్‌‌ల ద్వారా అనేక డిజిటల్ పరిష్కారాలను అందించింది. ఇది పాలసీ కొనుగోలు, రిన్యూవల్, క్లెయిమ్‌‌లు మొదలగు వాటికి సంబంధించిన తన ప్రక్రియలను మరింత సరళీకృతం చేసింది.  మార్చి 31, 2021 వరకు వినియోగదారులకు హోమ్ హెల్త్‌‌కేర్ ప్రయోజనం అందుబాటులో ఉంటుంది.

Related Posts