ఎస్ కోటలో గంజాయి రవాణా
విజయనగరం జూన్ 17
విజయనగరం జిల్లా శృంగవరపుకోట పూర్తిగా గంజాయి కోటగా మారింది. ఎందుకనగా విశాఖకు ఏజన్సీ ముఖద్వారం కావటం నిత్యం మన్యం లో సాగుచేస్తున్న గంజాయి పంట కు ఎస్ కోట అడ్డాగా మార్చుకున్నారు. ఎస్ కోట మార్గం గుండా వెళ్తుంది. వివిధ వాహనాల ద్వారా అక్రమార్కులు తరలిస్తున్నా శృంగవరపుకోట పోలీసులు తనిఖీలలో పట్టుపడితున్నా ఈ గంజాయి రవాణా ఆగడం లేదు ముఖ్యంగా కాలేజి లు చదువుకుంటున్న యువత ని స్మగ్లర్లు ఈ గంజాయి రవాణాకి వాడుకుంటున్నారు.జల్సాలకు అలవాటు అయ్యి ఇటువంటి రవాణాలకు పాల్పడి వారి భవిష్యత్తు నాశనం చేసుకుంటున్నారు. ఈ వారంలోనే ఒక కార్లో 18 కేజీలు కొత్తకారు ఇద్దరు యువకులు రవాణా చేస్తుండగా పట్టు బడ్డారు. మరుసటి రోజు ఆటో లో సుమారు 100 కేజీలు ఇద్దరు యువకులు తరలిస్తుండగా పట్టుబడ్డారు.అదే విధంగా నిన్న కార్లో ముగ్గురు యువకులు సుమారు 10 కేజీలు తరలిస్తుండగా పట్టుబడ్డారు.అదే రోజు బస్ లో తరలిస్తుండగా పట్టుబడ్డారు. ఇన్ని జరుగుతున్న వీరి ఆగడాలు మారటం లేదు. పోలీసులు పూర్తిగా ఈ గంజాయి పై దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు గస్తీ లు నిర్వహించి పట్టుకుంటున్నా స్మగ్లర్లు రవాణా ఆపడం లేదు ఇటు వంటి చర్యలకు యువత బలైపోతున్నారు. ఈ విషయం పై శృంగవరపుకోట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు యువతను యువత తల్లి తండ్రులు ను ఉద్దేశించి మాట్లాడుతూ ఇటువంటి అక్రమ రవనాల వలన అనవసరంగా యువత భవిశ్యత్తు నాశనం చేసుకుంటున్నారని దీని పై వీరి తల్లి తండ్రులు వీరి పై దృష్టి పెట్టి అసలు పిల్లలు ఏమిచేస్తున్నారు వారు ఎటువంటి తిరుగుళ్లు తిరుగుతున్నారు వారు ఏమి చేస్తున్నది జాగ్రత్తలు పాటిస్తూ వారిని అదుపులో పెట్టుకునేలా ఉండాలని యువత అనవసరపు అలవాట్లు మానుకుని చక్కని భవిష్యత్తు ఏర్పాటు చేసుకోవాలని వారిని ఉద్దేశించి తెలిపారు.