సుశాంత్ మృతి..కరణ్, సల్మాన్ సహా ఆరుగురిపై కేసు
ముంబాయ్ 17
సుశాంత్ మరణం బాలీవుడ్‌లో పెను ప్రకంపనలు పుట్టిస్తుంది. కొందరు ప్రముఖుల వలననే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని పలువురు ఆరోపిస్తుండగా, అభిమానులు కూడా వారికి మద్దతు పలుకుతున్నారు.'చిచోర్' సినిమా విజయవంతం అయినప్పటికీ కావాలనే 7 సినిమాల్లో సుశాంత్‌ని తప్పించారని రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ సంచలన ట్వీట్ చేశారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య వెనుక బాలీవుడ్ ప్రముఖుల హస్తం ఉందని గట్టి వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో బిహార్‌కు చెందిన ప్రముఖ న్యాయవాది సుధీర్ కుమార్ ఓఝా న్యాయస్థానంలో పిటీషన్ దాఖలు చేశారు. ఎనిమిది మంది బాలీవుడ్ ప్రముఖులు సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకునేలా పురికొల్పారని ఫిర్యాదు చేశారు. ఇందులో ప్రముఖ దర్శక నిర్మాతలు కరణ్ జొహార్, సంజయ్ లీలా భన్సాలీ, బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, హిందీ టీవీ సీరియళ్ల నిర్మాత, బాలాజీ టెలిఫిల్మ్స్ చీఫ్ ఏక్తా కపూర్ సహా మరో నలుగురి పేర్లను ఆయన ఈ పిటీషన్‌లో చేర్చారు. ఈ ఎనిమిది మంది సుశాంత్ మానసికంగా కుంగిపోయేలా చేసి ఆత్మహత్యకి పాల్పడేలా చేశారని పిటీషన్‌లో పేర్కొన్నారు బీహార్‌లోని ముజప్ఫర్‌పూర్‌లో బుధవారం ఉదయం పిటీషన్ వేయగా, పైన చెప్పిన ఎనిమిది మందికి కఠిన శిక్ష వేయాలని పిటీషన్‌లో పేర్కొన్నారు. వీరిపై 306, 109, 504, 506 సెక్షన్ల కింద చర్యలు తీసుకోవాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు సుధీర్ కుమార్ చెప్పారు