ఉద్యోగుల్లో సమయ పాలన, పారదర్శకత కోసం ప్రారంభించిన బయోమెట్రిక్ హాజరు విధానం ఫీల్డ్ స్టాఫ్ కు పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే వైజాగ్ జీవీఎంసీ పాఠశాలల్లో బయోమెట్రిక్‌మిషన్లు సిగ్నల్స్ లేక హాజరు నమోదు విషయంలో ఉపాధ్యాయులే అష్టకష్టాలు పడుతున్నారు.ఇటీవలకాలంలో తరచూ అంగన్ వాడీ కేంద్రాలలో జరుగుతోన్న అవకతవకలపై వార్తలు వస్తోన్న నేపధ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నారు. బాలింతలు,గర్భిణీలు, శిశువులకు మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారాఅందుతోన్న పౌష్టికాహారం పక్కదారి పడుతోంది.దీన్ని నిరోధించేందుకు అన్ని అంగన్ వాడీ కేంద్రాలలో ఐరిస్ విధానాన్ని అమలు చేయాలని మంత్రి అధికారులనుఆదేశించారు. అలాగే లబ్ధిదారులకు అందించే పథకాలకు సంబంధించి అధికారులు ప్రతిరోజూ సమీక్షనిర్వహించుకోవాలని అధికారులకు మంత్రి సూచించారు. చాలదన్నట్టు అంగన్‌వాడీ సిబ్బంది కూడా వీరి వెనుక క్యూ కట్టాల్సిన దుస్థితి నెలకొంది. అక్కడ ఎప్పుడు హాజరు వేస్తారు, ఎప్పుడు అంగన్‌వాడీ కేంద్రాలకు చేరుకుంటారో అధికారులే సెలవివ్వాలి. తోచిందే తడువుగా నిర్ణయాలు ప్రకటించడంతో పలుశాఖ ఉద్యోగులకు తలనొప్పిగా మారుతోంది. సిగ్నల్స్ సరిగా లేక పాఠశాలల్లో ఉపాధ్యాయులే హాజరు నమోదుకు ఇక్కట్లు పడుతుంటే... తాజాగా అంగన్‌వాడీలు కూడా బయోమెట్రిక్ వేయాలని ఉత్తర్వులు జారీ చేయడంపై వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాలకు సమీపంలో గల జీవీఎంసీ పాఠశాలలకు వెళ్లి కార్యకర్తలు, ఆయాలు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే అంగన్‌వాడీ టీచర్లు పల్స్‌పోలియో, స్మార్ట్‌ఫోన్లలో వివరాల నమోదు, ప్రీ–స్కూలు నిర్వహణ, పౌష్టికాహారం పంపిణీ, మధ్యాహ్నభోజన పథకాలతో తీవ్ర పని ఒత్తిడితో సతమతమవుతున్నారు. అంగన్‌వాడీ టీచర్లలో చాలామంది బీఎల్‌ఓలుగా ఓటర్లనమోదు డ్యూటీలు సైతం నిర్వహిస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది నుంచి స్మార్ట్‌ఫోన్లు వినియోగంలోకి తెచ్చారు. దీనితో టీచర్లంతా పిల్లల హాజరు, మధ్యాహ్న భోజనాలు, బాలింతలు, గర్భిణులు, పౌష్టికాహారం పంపిణీ వంటి సమస్త వివరాలన్నీ ఏ రోజుకారోజు స్మార్ట్‌ఫోన్లలో నమోదు చేస్తున్నారు.ఈ వివరాలన్నీ ఉన్నతాధికారులకు సైతం ఆన్‌లైన్‌లో అందుబాటులో వుంటాయి. ఈ నేపథ్యంలో టీచర్ల హాజరు కూడా స్మార్ట్‌ఫోన్లలో నమోదు చేసే అవకాశం కల్పిస్తే సరిపోతుంది కదా అని పలువురు సూచిస్తున్నారు. నగరంలోని రెండు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 232 అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి. భీమిలి, పెందుర్తి ప్రాజెక్టుల పరిధిలో కూడా అంగన్‌వాడీ కేంద్రాలు వున్నాయి.