పది పరీక్షలపై పునరాలోచన చేయాలి
విశాఖపట్నం జూన్ 17
ప్రస్తుతం కరోనా విబృంభిస్తున్న తరుణంలో పదోతరగతి పరీక్షలపై బీజేపీ ఆందోళన వ్యక్తం చేసింది.విద్యావ్యవస్ధలో పదోతరగతి పరీక్షకు అత్యంత ప్రధాన్యత ఉన్నప్పటికీ ప్రభుత్వం పరీక్షల నిర్వహణపై పునరాలోచించాలని బిజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యులు సురేంధ్ర మోహన్ విజ్నప్తి చేశారు. ఏపీ ప్రభుత్వం అన్నీ అంశాలను రాజకీయం చేస్తోందని ఆరోపించిన ఆయన .. పదోతరగతి విఫయంలోనూ మొండిగా ముందుకెళ్లడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పదోతరగతి విధ్యార్ధులు పరీక్షలకు సిద్దమవుతున్న తరుణంలో కరోనా వచ్చిందని, ఈ విపత్కర పరిస్ధితిలో విధ్యార్ధుల భవిష్యత్ గురించి ఆలోచించాల్సిన ప్రభుత్వం పరీక్షల నిర్వహణలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.