YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

చైనాకు  భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

చైనాకు  భారత్ స్ట్రాంగ్ వార్నింగ్

చైనాకు  భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ, జూన్ 17
చైనా సరిహద్దులో ఘర్షణల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. చైనాకు గట్టి హెచ్చరికలు పంపారు. మన సైనికుల త్యాగం వృథా కాదని పేర్కొన్నారు. భారత్ తలచుకుంటే ఏదైనా చేయగలుగుతుందన్నారు. కరోనా వ్యాప్తి, నివారణ అంశాలపై ముఖ్యమంత్రులతో రెండో రోజైన బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులతో పాటు పలువురు సీఎంలు పాల్గొన్నారు. గాల్వాన్ సరిహద్దులో అమరులైన సైనికులకు నివాళిగా ప్రధానితో పాటు ముఖ్యమంత్రులు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా సైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేం, వారి త్యాగం వృథాగా పోదు.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందిప్రధాని మోదీసైనికుల త్యాగాలు ఎన్నటికీ మరువలేమని ప్రధాని పేర్కొన్నారు. వారి త్యాగం వృథాగా పోదని దేశానికి హామీ ఇస్తున్నట్లు ప్రకటించారు. భారత సార్వభౌమాధికారంపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం తమకు అత్యంత ప్రాధాన్య అంశాలని తెలిపారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని.. కానీ, ఎవరైనా రెచ్చగొడితే దీటుగా బదులివ్వడానికి సిద్ధమని పేర్కొన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు దేశం సిద్ధంగా ఉందని తెలిపారు.లఢక్‌లోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలు తీవ్ర హింసాత్మక ఘటనకు దారి తీసిన సంగతి తెలిసిందే. జూన్ 15 రాత్రి జరిగిన ఘర్షణల్లో ఇండియన్ ఆర్మీకి చెందిన 20 మంది సైనికులు అమరులయ్యారు. వీరిలో తెలంగాణలోని సూర్యాపేటకు చెందిన కల్నల్ సంతోశ్ బాబు ఉన్నారు. చైనా వైపున కూడా 40 మంది వరకు సైనికులు మరణించినట్లు తెలుస్తోంది. 19న  ఆల్ పార్టీ మీటింగ్ చైనా సరిహద్దులో ఘర్షణల అంశంపై ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీకి పిలుపునిచ్చారు. శుక్రవారం (జూన్ 19) సాయంత్రం 5 గంటలకు అన్ని పార్టీల అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశం జరుగుతుంది. దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులు పాల్గొని తమ అభిప్రాయాలు తెలియజేయాల్సిందిగా ప్రధాని కార్యాలయం బుధవారం ట్వీట్ చేసింది

Related Posts