ఇవాళ ఇంటర్ ఫలితాలు
హైద్రాబాద్, జూన్ 17,
తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. సాయంత్రం వరకూ ఇంటర్ రిజల్ట్స్ విడుదలవుతాయని ఇంటర్మీడియట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయనున్నట్లు టీఎస్ ఇంట్మీడియట్ బోర్డు అధికారులు ప్రకటించారు. ఇంటర్ పరీక్షా ఫలితాలకు సంబంధించిన అన్ని పనులు పూర్తి అయ్యాయని, తుది నివేదికను విద్యాశాఖకు సమర్పించినట్లు ఇంటర్ బోర్డు సెక్రటరీ తెలిపారు.కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.గతేడాది జరిగిన అనుభవాల ద`ష్ట్యా ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అనే విషయాలపై ఒకటికి రెండుసార్లు పరీశీలించి నిర్ణయం తీసుకున్నారు.