YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు దేశీయం విదేశీయం

ధీటుగా సమాధానం చెబుతాం

ధీటుగా సమాధానం చెబుతాం

ధీటుగా సమాధానం చెబుతాం
న్యూఢిల్లీ జూన్ 17 
భారతదేశ సార్వభౌమాధికారాన్ని కాపాడడంలో రాజీ ప్రశక్తే లేదని ప్రధాని నరేంద్ర వెూడీ స్పష్టం చేశారు. బుధవారం నాడు అయన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అయన మాట్లాడారు.  ప్రధాని మాట్లాడుతూ భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని... రెచ్చగొడితే మాత్రం దీటుగా సమాధానం చెపుతామని అన్నారు.  భారతదేశం ఎల్లవేళలా శాంతినే కోరకుంటుందని, అయితే సార్వభౌమాధికారం విషయంలోరాజీ ఉండదని హెచ్చరించారు. చైనా దుర్మార్గం కారణంగా అమరులైన సైన్యం త్యాగాలు వృధా కానివ్వబోమన్నారు.. దేశ రక్షణ కోసం అమరులైన 20 మంది జవాన్ల వీరత్వం ఏమాత్రం వృథా పోదని అన్నారు. భారత్ శాంతికాముక దేశమే అయినా,  రెచ్చగొడితే మాత్రం సరైన, దీటైన జవాబు చెప్పడానికి సదా సిద్ధంగా ఉంటుందన్నారు.    వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో పాల్గొన్న వెూదీ, లేచి నిలబడి  నివాళులర్పించి రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్న హోం మంత్రి అమిత్ షా, సీఎంలు కూడా అమర జవాన్లకు నివాళులు అర్పించారు. అమర జవాన్ల త్యాగాన్ని చూసి దేశం గర్విస్తోందని వెూమోడీ అన్నారు

Related Posts