YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 డొక్కాకు సీటు అనుమానమే...

 డొక్కాకు సీటు అనుమానమే...

 డొక్కాకు సీటు అనుమానమే...
గుంటూరు, జూన్ 18,
ఇప్పుడు జగన్ మరో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మరో ఎమ్మెల్సీ ఎన్నికకు ఆంధ్రప్రదేశ్ లో షెడ్యూల్ విడుదల అయింది. టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరగనుంది. శాసన సభ్యుల కోటాలో ఈ ఎన్నిక జరుగుతుండటంతో ఈ స్థానం వైసీపీ పరం కానుంది. 151 శాసనసభ్యులు ఉన్న వైసీపీకే భవిష్యత్ లో ఎమ్మెల్సీ స్థానాలు దక్కనున్నాయి. ఈనేపథ్యంలో డొక్కా మాణిక్య వరప్రసాద్ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.డొక్కా మాణిక్యవరప్రసాద్ 2014 ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన వెంటనే చంద్రబాబు ఎమ్మెల్సీ స్థానం కేటాయించారు. రాయపాటి సాంబశివరావు సిఫార్సుతో ఆయనకు ఎమ్మెల్సీ స్థానం దక్కింది. గత ఎన్నికల్లో ఆయన తాడేపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనుకున్నా సీటు ఇవ్వలేదు. డొక్కా మాణిక్యవరప్రసాద్ కు పత్తిపాడు నియోజకవర్గం కేటాయించారు. అక్కడ ఓటమి పాలయ్యారు. తన ఓటమికి గంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కారణమని డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు.అయితే మూడు రాజధానుల ప్రతిపాదన రావడంతో శాసనమండలికి బిల్లు వెళ్లడం, అక్కడ టీడీపీ మెజారిటీ ఉండటంతో డొక్కా మాణిక్య వరప్రసాద్ రాజీనామా చేశారు. తన రాజీనామాకు కారణాలు చెప్పకపోయినా ఆయన వైసీపీలో చేేరేందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని అప్పట్లో ప్రచారం జరిగింది. తర్వాత కొన్నాళ్లకు జగన్ సమక్షంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. టీడీపీలో ఇమడలేకనే పార్టీని వీడానని ఆయన అప్పట్లో చెప్పారు.కానీ ఇదే సీటును జగన్ ఎవరికి ఇవ్వనున్నారన్న చర్చ పార్టీలో జరుగుతుంది. తిరిగి డొక్కా మాణిక్యవరప్రసాద్ ను ఎంపిక చేస్తారన్న ప్రచారం ఒకవైపు ఉంది. అయితే అదే సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాలని మరికొందరు పట్టుబడుతున్నారు. దీనిపై జగన్ ఇప్పటికే కసరత్తులు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎస్సీ వర్గానికే ఇవ్వాలన్నది జగన్ నిర్ణయంగా ఉంది. అయితే అతి తక్కువ కాలం ఉన్న ఈ పోస్టులో జగన్ ఎవరిని ఎంపిక చేస్తారన్నది వైసీపీలో హాట్ టాపిక్ గా ఉంది.

Related Posts