YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మహానగర ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం

 మహానగర ట్రాఫిక్ సమస్యలకు ఉపశమనం

మహానగరంలో రోజురోజుకీ పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య నుంచి నగరవాసులకు ఉపశమనం కలిగించేందుకు ప్రభుత్వ ప్రతిపాదించిన వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌ఆర్‌డీపీ) పనులు ఒకవైపు వేగంగా సాగుతున్నా, మరికొన్ని ప్రాంతాల్లో గ్రహణం పట్టింది. ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు ప్రతిపాదిత ప్రత్యామ్నాయ లింకురోడ్లను గుర్తించిన జీహెచ్‌ఎంసీ వాటి ఏర్పాటుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. 16 లింకు రోడ్లను అవసరాలకు అనుగుణంగా విస్తరించాలంటే 204ఆస్తులను సేకరించాల్సి ఉంటుంది. వీటిని విస్తరిస్తేనే ఫలితం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం అధికారులు ఆ దిశగా సన్నాహాలు చేస్తున్నారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడంతోపాటు వేగంగా గమ్యాన్ని చేర్చే కార్యక్రమాల్లో భా గంగా ఎస్‌ఆర్‌డీపీ కింద సిగ్నల్ ఫ్రీ కారిడార్లు, మల్టీలెవల్ ైఫ్లెఓవర్ల నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్న విషయం విదితమే. అంతేకాకుండా మె ట్రో, ఎంఎంటీఎస్‌లతోపాటు ఇతర ప్రజా రవా ణా వ్యవస్థలను వేగవంతంగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రధాన రహదారులపై ట్రాఫిక్ రద్దీని గణనీయంగా తగ్గించేందుకు లింక్ రోడ్లపై దృష్టి కేంద్రీకరించారు. బంజారాహి ల్స్, జూబ్లీహిల్స్, కాచిగూడ, ఆబిడ్స్, కూకట్‌పల్లి, మాదాపూ ర్, శేరిలింగంపల్లి, అంబర్‌పేట్ తదితర ప్రాంతాల్లోని ప్ర ధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు 16 లింక్‌రోడ్లను గుర్తించారు. వీటిపై సమగ్ర సర్వే నిర్వహించగా అవసరాలకు అనుగుణంగా విస్తరించాలంటే 204ఆస్తులను తొలగించాల్సి ఉంటుందని తేలింది. దీంతో అధికారులు ఆస్తుల సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలో మా ర్కింగ్, ఆస్తుల విలువ లెక్కింపు తదితర తదుపరి చర్య లు చేపడతామని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఈ లింకురోడ్లు అందుబాటులోకొస్తే ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ రద్దీ తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారుఈ పనులకు క్షేత్ర స్థాయిలో ఎదురయ్యే అడ్డంకులను అధిగమించటంలో కలిసిమెలిసి చక్కటి సమన్వయంతో ముందుకెళ్లాల్సిన జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్, టౌన్‌ప్లానింగ్ విభాగం అధికారుల మధ్య తలెత్తిన సమన్వయలోపం పనులకు గ్రహణంగా మారింది. రెండు శాఖల సయోధ్య కుదిర్చి, పనులెలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై ఉన్నతాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఎట్టకేలకు ఈ వ్యవహారం ఇటీవలే మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కే. తారక రామారావు వరకూ చేరినట్లు సమాచారం. ఎస్‌ఆర్‌డీపీ మొదటి ప్యాకేజీలో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ సజావుగా సాగేందుకు, సిగ్నల్ రహిత ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు పార్కు చుట్టూ మల్టీలేవెల్ ఫ్లై ఓవర్లు, స్కై వేలు, కేబుల్ బ్రిడ్జిలను ప్రతిపాదించారు. సంబంధించి పలు ప్రాంతాల్లో పనులు కూడా కొనసాగుతున్నా, పెద్దమ్మగుడికి వెళ్లేదారిలోని రోడ్ నెంబర్ 45లో నిర్మించనున్న మల్టీలేవెల్ ఫ్లైఓవర్, కేబుల్ బ్రిడ్జి పనులు డైలమాలో పడ్డాయి. ప్రస్తుతం 80 అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇక్కడి రోడ్డును మరో 40 అడుగులకు విస్తరించేందుకు స్థల సేకరణ చేయాలా? లేదా? అన్నదీ ఇంకా తేలాల్సి ఉంది. ఒకవేళ స్థల సేకరణ చేస్తే, స్థలాలు కోల్పోయే వారికి ట్రాన్స్‌ఫర్ డెవలప్‌మెంట్ రైట్స్ ఇవ్వాల్సిందేనని టౌన్‌ప్లానింగ్ అధికారులు వాదిస్తుండగా, అక్కడున్న వారందరూ కూడా అత్యధిక ధనికవర్గాలు కావటంతో వారికి టీడీఆర్ ఇవ్వాల్సిన అవసరం లేదని, ఒక వేళ ఇచ్చినా, దాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశాల్లేవని ఇంజనీరింగ్ విభాగంలోని కొందరు అధికారులు వాదిస్తున్నారు. ఒకవేళ టౌన్‌ప్లానింగ్ అధికారులు స్థల సేకరణ వద్దనుకున్న, ముందుగా ప్రతిపాదించిన విధంగా రోడ్ నెంబర్ 45లో ప్రస్తుతమున్న రోడ్డుపైనే తాము మల్టీలేవెల్ ఫ్లై ఓవర్, కేబుల్ బ్రిడ్జిని నిర్మించవచ్చునని ఇంజనీరింగ్ అధికారులంటున్నారు. గతంలో కూడా బేగంపేట నుంచి ఫతేనగర్ వరకు నిర్మించిన లింకురోడ్డుపై ఈ రెండు విభాగాల మధ్య సమన్వయం కుదరకపోవటంతో పనులకు తీవ్ర స్థాయిలో జాప్యం జరిగింది. ఆ రోడ్డు ఫైళ్లు కొన్ని గల్లంతైన వ్యవహారం అప్పట్లో తీవ్ర స్థాయిలో సంచలనం సృష్టించింది. ఎస్‌ఆర్‌డీపీ రోడ్ నెంబర్ 45 పనుల వ్యవహారం ఇప్పటికే మున్సిపల్ మంత్రి దృష్టికెళ్లటంతో త్వరలోనే మంత్రి ఉభయ శాఖల అధికారులను పిలిచి చర్చించే అవకాశాలు ఉన్నాయి.

Related Posts