YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

కర్ణాటక కాంగ్రెస్ లో గ్రూపుల గోల

కర్ణాటక కాంగ్రెస్ లో గ్రూపుల గోల

కర్ణాటక కాంగ్రెస్ లో గ్రూపుల గోల
బెంగళూర్, జూన్ 18,
కాంగ్రెస్ కు ఏ ఎన్నికలు వచ్చినా కష్టమే. ముందు అభ్యర్థుల ఎంపిక దానికి సవాల్ గా మారనుంది. ప్రతి రాష్ట్రంలోనూ అదే పరిస్థితి. కాంగ్రెస్ లో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ కాబట్టి ఇక్కడ పోటీ ఎక్కువగానే ఉంటుంది. అధికారంలో ఉన్నా, లేకపోయినా కాంగ్రెస్ లో పోటీ మామూలుగా ఉండదన్నది వాస్తవం. కర్ణాటకలో మరో ఎన్నికలు కాంగ్రెస్ కు సవాల్ గా మారనున్నాయి. శాసనమండలి ఎన్నికలు జరగనున్నాయి.కర్ణాటకలో మొత్తం ఐదు శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో కాంగ్రెస్ రెండు, బీజేపీ రెండు, జనతాదళ్ ఎస్ ఒక స్థానాన్ని కైవసం చేసుకునే వీలుంది. శాసనసభలో బలాబలాల ఆధారంగా ఈ పదవులు ప్రతి పార్టీకి దక్కనున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ లకు సమానంగా సీట్లు రానున్నాయి. బీజేపీలో శాసనమండలి సభ్యులు ఎవరన్నది అధిష్టానం నిర్ణయిస్తుంది. కాంగ్రెస్ కూడా అంతే కాని, రాష్ట్ర స్థాయి నేతల అభిప్రాయాలు ఎంపికలో ముఖ్యమవుతాయి.కొత్తగా ఎన్నికయ్యే వారి పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉంటుంది. అయినా సరే కాంగ్రెస్ లో పోటీ అధికంగా ఉంది. రెండు పదవుల కోసం దాదాపు నలభై మంది వరకూ పోటీ పడుతున్నారు. వీరిందరి పేర్ల జాబితాను సేకరించి ఖరారు చేసి అధిష్టానానికి పంపేందుకు పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ బిజీగా ఉన్నారు. ఈ నలభై మందిలో డీకే శివకుమార్ వర్గంతో పాటు, సిద్ధరామయ్య వర్గానికి చెందిన వారు కూడా ఉన్నారు.డీకే శివకుమార్ పీసీసీ అధ్యక్షుడు ప్రధాన నేతలందరితోనూ చర్చలు జరిపారు. ఇటు సిద్ధరామయ్యతో పాటు సీనియర్ నేత మల్లికార్జున ఖర్గేతో కూడా సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. అయితే ఇంకా కొలిక్కి రాలేదు. అధిష్టానం నిర్ణయం కోసం వీరు వేచిచూస్తున్నారు. గురువారం నామినేషన్ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. మూడు పార్టీల నుంచి ఐదుగురు సభ్యులు మాత్రమే నామినేషన్ దాఖలు చేస్తే ఐదుగురు ఏకగ్రీవం అవుతారు. లేకుంటే ఈ నెల 29వ తేదీన ఎన్నిక జరుగుతుంది. మరి కాంగ్రెస్ లో గ్రూపులు గలాటా ఈ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటాయో చూడాల్సి ఉంది.

Related Posts