చైనాకు చెక్ చెప్పేదిశగా అడుగులు
న్యూఢిల్లీ, జూన్ 18
చైనాతో యుద్ధం తప్పదా? ఆ దేశం కాలుదువ్వుతుంది అందుకేనా? అంటే అవుననే అంటున్నారు. చైనా కావాలని రెచ్చగొడుతుందన్న విషయం స్పష్టంగా అర్థమవుతుంది. చైనాతో యుద్ధం వస్తే మన పరిస్థితి ఏంటి? చైనా తోక ముడిపించగలమా? అంటే ఖచ్చితంగా అని అంటున్నారు. చైనాతో వైరం ఈ నాటిది కాదు. గత కొన్ని దశాబ్దాలుగా చైనాతో వైరం భారత్ కు ఉంది. సరిహద్దు ప్రాంతాల్లో చైనా కాలు దువ్వుతుండటమే ఇందుకు కారణం.తాజాగా లడ్హాఖ్ లోని గాల్వాన్ లోయ రక్తసిక్తమయింది. భారత్ జవాన్లు 20 మంది వరకూ మరణించారు. చైనా సైనికులు కూడా 40 మంది వరకూ మరణించినట్లు సమాచారం. ఇందుకు ఉదాహరణ గాల్వన్ లోయలోకి చైనా హెలికాప్టర్లు, ఆంబులెన్స్ లు పెద్దయెత్తున రావడంతో చైనా సైన్యం కూడా పెద్ద యెత్తున నష్టపోయిందనే చెబుతున్నారు. గాల్వన్ లోయలో చైనా సైనికులు కవ్వింపులకు దిగి, రాళ్లు రువ్వి ఘర్షణకు తెరదీశారు.భారత్ కు చైనా, పాకిస్థాన్ సరిహద్దులతోనే సమస్య. ఈ రెండు దేశాలు నిత్యం కవ్వింపు చర్యలకు దిగుతుంటాయి. చైనా నుంచి ఎక్కువగా చొరబాట్లు ఉంటాయి. ఈ సంగతి భారత్ కు తెలియంది కాదు. 65 వ దశకంలో చైనాతో జరిగిన యుద్ధం భారత్ కు నష్టాన్ని మిగిల్చింది. నెహ్రూ ఈ పరాభావంతో మరణించారని అంటారు. అప్పటి నుంచ చైనా పట్ల భారత్ ముందుచూపుతో వ్యవహరిస్తుంది. ఆయుధ సంపత్తిని పెంచుకుంది. సరిహద్దుల్లో మౌలిక వసతులను ఏర్పాటు చేసుకుంది.భారత్ – చైనా మధ్య దాదాపు 3,380 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం ఉంది. ఈశాన్య రాష్ట్రాలతో పాటు జమ్మూకాశ్మీర్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలు ఈ సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఇక్కడ పూర్తి స్థాయి రోడ్లను నిర్మించారు. 3,409 కిలోమీటర్ల నిడివి గల 61 రహదారుల నిర్మాణ పనులు చేపట్టారు. ఇలా అన్ని రకాలుగా భారత్ పూర్తి స్థాయిలో సిద్ధమయింది. తాజాగా ఈ నెల 19వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ అఖిలపక్ష సమావేశంలో మాట్లాడతారు. ఇప్పటికే ప్రధాని మోదీ చైనాకు హెచ్చరిక జారీ చేశారు. కావాలని కవ్వింపు చర్యలకు దిగితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిక పంపారు. మొత్తం మీద చైనా, భారత్ సరిహద్దుల్లో యుద్ధమేఘాలు అలుముకున్నాయి.