YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 చంద్రబాబు ఆశలు తీరతాయా..

 చంద్రబాబు ఆశలు తీరతాయా..

 చంద్రబాబు ఆశలు తీరతాయా..
న్యూఢిల్లీ, జూన్ 18,
అదేంటి దేశ ప్రధాని మోడీని పట్టుకుని నానా మాటలు చంద్రబాబు అన్నారు కదా. దాన్ని ఏపీ జనంతో పాటు జాతీయ స్థాయిలో అంతా చూశారు కూడా. అటువంటిది మోడీకి బాబు మీద పీకలదాకా కోపం ఉండాలి కదా. కానీ బాబు మీద దయ చూపడమేంటి. అంటే బాబు ప్రస్తుత జీవితం మోడీ దయ అంటున్నారు వైసీపీ నేత దాడి వీరభద్రరావు. ఏపీలో అవినీతి గత అయిదేళ్ళలో విచ్చలవిడిగా జరిగింది, అన్నింటికంటే మిన్నగా పోలవరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది. దీన్ని నాడు ప్రధాని మోడీ స్వయంగా ఏపీకి వచ్చి కూడా చెప్పారు. ఏటీఎం మాదిరిగా పోలవరం చంద్రబాబుకు ఉపయోగపడుతోంది అంటూ ఏ ముఖ్యమంత్రినీ నిందించని విధంగా హాట్ కామెంట్స్ చేశారు ఒక దేశ ప్రధాని అలా బాహాటంగా ఒక ముఖ్యమంత్రి మీద అంతలేసి మాటలు అన్నారంటే అది ఆషామాషీ విషయం కాదు కదా. పైగా పోలవరం జాతీయ ప్రాజెక్ట్. దానికి ఇచ్చే నిధులు అన్నీ కూడా కేంద్రమే ఇస్తుంది. అలాంటిది అవినీతి జరిగింది అని ఒక ప్రధాని అంటే విచారణ ఎంత గట్టిగా ఉండాలి.ఇక ఏపీలో ఆలీబాబా నలభై దొంగల మాదిరిగా అయిదేళ్ల చంద్రబాబు పాలనలో మొత్తానికి మొత్తం దోపిడీ జరిగింది అన్న సంగతి ప్రధాని మోడీకి, కేంద్ర హోం మంత్రి అమిత్ షా కు బాగా తెలుసు అని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అంటున్నారు. అన్ని లెక్కలతో సహా మొత్తం చంద్రబాబు అవినీతి బాగోతమే వారి వద్ద ఉందని కూడా చెబుతున్నారు. ఇపుడే వైసీపీ సర్కార్ ఏలుబడిలో చంద్రబాబు గత పాలన అవినీతి వెలుగుచూడడం మొదలైందని, ముందు ముందు చాలా బయటకు వస్తాయని అంటున్నారు. సరే ఇవన్నీ ఎలా ఉన్నా మోడీకి, షాకు చంద్రబాబు బాగోతం గురించి ఇంత తెలిస్తే వారు ఇన్నాళ్ళుగా ఎందుకు అలా వదిలేశారన్నదే ఇపుడు పెద్ద చర్చగా ఉంది.చంద్రబాబు 2019 ఎన్నికలకు ఏడాది ముందు ఎన్డీయే నుంచి వేరు పడి కాంగ్రెస్ కూటమి వైపు జరిగారు. ఆయన మోడీ దిగిపోవాలంటూ జాతీయ స్థాయిలో గట్టిగా పోరాడారు. అన్ని రాష్ట్రాలూ తిరిగి మరీ ప్రచారం చేశారు. మోడీ హఠావో అని కూడా అన్నారు. ఆయన హయాంలో దేశం బాగుపడింది లేదు అంటూ తీర్పు ఇచ్చారు ఇంత చేసిన చంద్రబాబు మీద మోడీ షాలకు ఎందుకు దయ కలుగుతోంది. మరోమారు బంపర్ మెజారిటీతో ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన మోడీ ఎందుకు చంద్రబాబు కు క్షమిస్తున్నారన్నది కూడా ఆసక్తికరమైన విషయంగానే ఉంది.మోడీ షాలు దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకులు అన్న సంగతి తెలిసిందే. అప్పటి దేశ హోం మంత్రిగా చిదంబరం ఎపుడో పదేళ్ల క్రితం తనను జైల్లో కొన్నాళ్ళుఉంచారని పగపట్టి మరీ అమిత్ షా హోం మంత్రి కాగానే చిదంబరం మీద వెంటనే కక్ష తీర్చుకున్నారు. కొన్నాళ్ళైనా చిదంబరానికి జైలు కూడు రుచి చూపించారు. అలాంటిది చంద్రబాబు మీద ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని ఏకంగా మోడీ షాలే అంటున్నారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. కానీ ఇప్పటికి రెండవమారు గెలిచి రెండవ ఏటిలోకి ప్రవేశించినా కూడా చంద్రబాబుని ఏం చేయలేదంటే దీని వెనక కూడా అసలైన రాజకీయమే ఉందనుకోవాలేమో. చంద్రబాబు ను ఎలాగైనా సరెండర్ చేసుకోవాలన్నదే ఆ రాజకీయమని కూడా అంటున్నారు. మరి అవినీతి, ఆవకాయ అంటే ఇప్పటి రాజకీయాల్లో వీటిని గురించి గట్టిగా అడగకూడదేమో. ఏది ఏమైనా దాడి వీరభద్రరావు తన సీనియార్టీతో బాగానే చెప్పారు. మోడీ దయ చంద్రబాబు మీద చాలా ఉందని. మరి ఆ దయ ఎత్తూ బరువూ ఏపాటివో రానున్న రోజులు ఇంకా బాగా రుజువు చేస్తాయేమో.

Related Posts