YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఏప్రిల్ 15 నుంచి ఈ వే బిల్లు

ఏప్రిల్ 15 నుంచి ఈ వే బిల్లు

రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు అవసరమయ్యే ఈ-వే బిల్లు వ్యవస్థ 5  రాష్ట్రాలలో ఏప్రిల్ 15 నుంచి అమలులోకి రానుంది. రూ. 50,000లకు పైగా విలుైవెన వస్తువులను ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి చేరవేయడానికి ఎలక్ట్రానిక్-వే లేదా ఈ-వే బిల్లును ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి అమలులోకి తెచ్చింది. రాష్ట్రం లోపల రవాణాకు కూడా అదే విధైమెన ఏప్రిల్ 15 నుంచి అమలులోకి తేనున్నట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొదటి దశలో భాగంగా, మొదట ఈ ఐదు రాష్ట్రాల్లో ఇంట్రా స్టేట్ ఈ-వే బిల్లు అమలు జరుపుతారు. ‘‘ఈ రాష్ట్రాల్లో ఈ-వే బిల్లును అమలులోకి తేవడం ద్వారా, వస్తువుల రవాణాకు సంబంధించినంత వరకు వర్తక సంస్థలకు, పరిశ్రమలకు మరింత వెసులుబాటు కలుగుతుందని భావిస్తున్నాం. పర్యవసానంగా, దేశవ్యాప్తంగా, ఒకే ఈ-వే బిల్లు వ్యవస్థకు మార్గం సుగమం అవుతుంది’’ అని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ ఐదు రాష్ట్రాల్లో ఉన్న వ్యాపార సంస్థలు, పరిశ్రమలవారు, ట్రాన్స్‌పోర్టర్లు ఈ-వే బిల్లు పోర్టల్‌లో రిజిస్టరు కావచ్చు. ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాకు ఈ-వే బిల్లును ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏప్రిల్ 9 వరకు  అటువంటి బిల్లులు 63 లక్షలకు పైగా జనరేట్ అయ్యాయి. రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు కూడా ఏప్రిల్ 1 నుంచి ఈ-వే బిల్లును అమలులోకి తెచ్చిన ఒకే ఒక రాష్ట్రం కర్ణాటక. రాష్ట్రాల మధ్య వస్తువుల రవాణాకు ఏప్రిల్ 1 నుంచి, రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు దశలవారీగా ఏప్రిల్ 15 నుంచి ఈ-వే బిల్లు అమలులోకి తేవాలని జి.ఎస్.టి కౌన్సిల్ గత నెలలో నిర్ణయించింది. దీనిని ఎగవేత నిరోధక చర్యగా, ప్రస్తుతం నగదు ప్రాతిపదికపై సాగుతున్న వర్తకానికి అడ్డుకట్ట వేసి, పన్నుల వసూళ్ళను పెంపొందించే చర్యగా అభివర్ణిస్తున్నారు. వస్తువులు, సేవల పన్నులో నిబంధనగా ఉన్న ఈ-వే బిల్లును ఫిబ్రవరి 1న మొదట ప్రవేశపెట్టారు. పర్మిట్లు జనరేట్ చేయడంలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో అమలును తాత్కాలికంగా స్తంభింపజేశారు. పలు రాష్ట్రాలు రాష్ట్రం లోపల వస్తువుల రవాణాకు కూడా పోర్టల్‌లో బిల్లులు జనరేట్ చేయడంతో అటువంటి సమస్య తలెత్తింది. అప్పటి నుంచి ప్లాట్‌ఫాంను మరింత బలోపేతం చేసి, రోజుకు దాదాపు 75 లక్షల ఇంటర్-స్టేట్ ఈ-వే బిల్లులు జనరేట్ చేయగలిగినదిగా తయారు చేశారు. 

Related Posts