YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు వాణిజ్యం ఆస్తి-పాస్తులు తెలంగాణ

 రియల్ భూములుగా మారుతున్న వ్యవసాయ భూములు 

 రియల్ భూములుగా మారుతున్న వ్యవసాయ భూములు 

 రియల్ భూములుగా మారుతున్న వ్యవసాయ భూములు 
రంగారెడ్డి, జూన్18, 
శివారు మండలాల్లో రియల్‌ ఎస్టేట్‌ పుంజుకోవడంతో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. క్రమంగా గ్రామంలోని వ్యవసాయ భూములన్నీ ఇళ్ల స్థలాలుగా మారాయి. పది సంవత్సరాలుగా ఇళ్ల నిర్మాణాలు ఊపందుకున్నాయి. పొలాలను అమ్ముకున్నవారు రియల్‌ వ్యాపారంలోకి దిగారు. దీనికి తోడుగా బిల్డర్‌లు రంగప్రవేశంతో పరిస్థితి పూర్తిగా మారిపోయిందిమండల కేంద్రాలకు దూరంగా ఉన్న గ్రామాల్లో సైతం ఎకరం ధర రూ.30లక్షల పైమాటే. ఇక లేఅవుట్‌లకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఎకరా రూ.60 లక్షల నుంచి రూ.కోట్లు పలుకుతోంది. కొత్తగా వెలుస్తోన్న కాలనీల్లో చాలా మంది ఎక్కువగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి స్థిరపడిన వారే ఉంటున్నారు. స్థానికంగా భూములు అమ్ముకుని, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారాల్లో లాభాలు ఆర్జించిన వారు ఖరీదైన జీవనశైలికి అలవాటుపడుతున్నారు. రూ.కోట్లు ఖర్చు చేసి ఇళ్లు, కార్లు సమకూర్చుకుంటున్నారు. శంషాబాద్‌ మండలంలోని ఊట్‌పల్లి, నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో వెలుస్తున్న కాలనీల్లో ఎక్కువగా ఇతర ప్రాంతాల వారే స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. శంషాబాద్‌ మండలంలోని ఊట్‌పల్లి పంచాయతీ పరిధిలో మొత్తం 960 ఎకరాల భూములుండగా.. ఇందులో 686 ఎకరాల్లో లేఅవుట్‌లు వెలిశాయి. ఐదేళ్ల కాలంలో దాదాపు 200 ఎకరాల్లో కొత్తగా వెంచర్లు వెలిశాయి.శంషాబాద్‌ మండల కేంద్రానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న నర్కూడ, చౌదరిగూడ గ్రామాల్లో కొత్త కాలనీల సంఖ్య  పెరిగిపోతోంది. వీటి పరి«ధిలో 3,858 ఎకరాల భూములుండగా.. 1500 ఎకరాల్లో లేఅవుట్‌లు ఉన్నాయి. గత ఐదేళ్ల కాలంలోనే ఇక్కడ 350 ఎకరాల్లో వెంచర్లు ఏర్పాటు చేశారు.అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలంలోని మునగనూరు గ్రామం రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. సుమారు 300 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామం 1992 వరకు ఇంజాపూర్‌ గ్రామ పంచాయితీ పరిధిలోని ఓ అనుబంధ గ్రామం. రోడ్డుకు దూరంగా ఉండడంతో ఉనికి కూడా కనిపించేది కాదు. బ్యాంక్‌ కాలనీ ఏర్పడిన తర్వాత 700పైగా ఓటర్లు కావడంతో అప్పడు గ్రామ పంచాయతీగా అవతరించింది. 2000 ఎకరాలకు పైగా సాగుభూమి ఉండేది. హయత్‌నగర్‌ పట్టణానికి అనుకుని ఉన్న ఈ గ్రామంలో 1982 నుంచి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్లాట్లు చేసి విక్రయించడం మొదలు పెట్టారు. . సుమారు 15 కాలనీలలో 1500 వరకు ఇళ్ల నిర్మాణం జరిగింది. వందల సంఖ్యలో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఇండిపెండెంట్‌ ఇళ్లతో పాటు బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. పట్టణ ప్రాంతం నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ ఇళ్లను కొగోలు చేస్తుడండంతో మునుగనూర్‌ హాట్‌ కేక్‌గా మారింది.

Related Posts