ఈనెల 17నుండి జరిగే ఓపెన్ స్కూల్స్ పదవ తరగతి పరీక్షలు, ఇంటర్మీడియేట్ వార్షిక పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు గావించి, ఏలాంటి అవకతవకలు జరగకుండా చూడనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించాలని, పరీక్షలు జరిగే సమయంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని, ఆయా ప్రాంతాల్లో ఉదయం 8.30 నుండి 11.30 గంటల వరకు జిరాక్స్ సెంటర్లు మూసివేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్షలు రాసే గ్రామీణ ప్రాంత విద్యార్థుల సౌకర్యార్థం కోసం ప్రత్యేక బస్సులను ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు నడుపాలని ఆర్టీసి అధికారులను ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో సిసి టీవీలు ఏర్పాటు చేయాలని డి ఈవోను ఆదేశించారు. విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ట్రాన్స్‌కో అధికారులను, పరీక్ష ప్రశ్నపత్రాల పంపిణీ, స్ట్రాంగ్ రూంల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. ఈనెల 17 నుండి మే 1వ తేదీ వరకు వార్షిక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. ఈనెల 17 ననుండి ఆదిలాబాద్‌లోని సరస్వతి హైస్కూల్‌లో జరిగే స్పాట్ వాల్యూవేషన్ కేంద్రం, స్ట్రాంగ్‌రూంల వద్ద సెక్యూరిటీ గార్డులను నియమించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోస్టల్ సిబ్బంది జవాబు పత్రాలను ఆయా గమ్య స్థానాలకు పంపిణీ చేసేలా అధికార యంత్రాంగానికి సహకరించాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ ద్వారా ఎస్సెస్సీ పరీక్షలు వ్రాసే వారికి మూడు కేంద్రాల్లో 828 మంది, ఇంటర్మీడియేట్ పరీక్షలు వ్రాసేవారికి రెండు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, 335 మంది విద్యార్థులు హాజరవుతారని అన్నారు.