YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం విదేశీయం

అభద్రత భావంలో చైనా దేశస్తులు 

అభద్రత భావంలో చైనా దేశస్తులు 

అభద్రత భావంలో చైనా దేశస్తులు 
న్యూఢిల్లీ జూన్18
సరిహద్దుల్లో పొరుగు దేశం చైనా వ్యవహార శైలి నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే చందంగా ఉంది. ఓవైపు సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతూ.. దొంగదెబ్బ తీయడానికి మరోవైపు ప్రయత్నిస్తోంది.సరిహద్దుల్లో భారత్, చైనా సైనికుల మధ్య చోటుచేసుకున్న ఘర్షణలో ఓ కల్నల్ సహా 20 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై యావత్తు భారతవనీ ఆగ్రహంతో ఊగిపోయింది. చైనాకు తగిన బుద్ధి చెప్పాలని నినదిస్తోంది. చైనాకు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు చేపట్టి.. ఆ దేశాధినేతల దిష్టిబొమ్మలను దగ్దం చేస్తున్నారు. భారతీయుల్లో ఆగ్రహావేశాలు పెల్లుబికుతుండటంతో ఇక్కడ చైనీయుల్లో కలవరం మొదలయ్యింది. తమకు ఎలాంటి హాని జరుగుతోందనని భద్రతపై ఆందోళన చెందుతున్నారు. తమను చైనా పౌరులుగా గుర్తిస్తారమోనని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కొందరు తమ స్నేహితుల వద్ద ఆశ్రయం పొందుతున్నా.. వారి కుటుంబాలకు భయపడుతున్నారు.సరిహద్దు ప్రతిష్టంభన, ఉద్రిక్తతల గురించి చర్చ జరుగుతోంది కానీ, భారతీయుల్లో సహనం ఎక్కువ.. అందుకే ఇక్కడ అంతా బాగానే ఉందని, తన కుటుంబానికి ఆందోళన చెందవద్దని చెప్పానని ఓ చైనా పౌరుడు పేర్కొన్నాడు. గురుగ్రామ్లో పనిచేస్తున్న మరో చైనా పౌరుడు మాట్లాడుతు.. ఇరు దేశాల మధ్య నెలకున్న ఉద్రిక్తతలతో మా కుటుంబం ఒత్తిడిని ఎదుర్కొంటోందని, అయితే, చాలా మంది స్నేహితులు తను అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు.ఇక్కడ ఉన్న చైనా పౌరులంతా సహజంగా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.. చైనాలోని భారతీయులు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉంటారని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ సెంటర్ ఫర్ చైనీస్ అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా స్టడీస్ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ దీపక్ అన్నారు. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు మొదలై 70 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న తరుణంలో సరిహద్దుల్లో ఘర్షణ చోటుచేసుకోవడం చాలా దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.ఇక, తాజా ఘర్షణలు ఆర్ధిక, ప్రజా సంబంధాలపై వ్యతిరేక ప్రభావం చూపుతాయని నిపుణులు అంటున్నారు. భారత్లోని చైనాకు చెందిన సంస్థల్లో వేలాది మంది చైనీయులు పనిచేస్తుండగా.. జేఎన్యూ వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో పలువురు విద్యాభ్యాసం చేస్తున్నారు. విద్య లేదా వ్యాపారాల కోసం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో దాదాపు 3,000 మంది చైనీయులు ఉండగా.. లాక్డౌన్కు ముందు సగం మంది స్వదేశానికి వెళ్లిపోయారు. భారత్లో చిక్కుకున్న చైనా పౌరులను ప్రత్యేక విమానాల్లో స్వదేశానికి తరలిస్తామని ఢిల్లీలోని చైనా ఎంబసీ మే 25న ప్రకటించింది.భారత్లోని వివిధ రంగాల్లో 2వేల వరకు చైనా సంస్థలు ఉన్నాయి.. వీటిపై ప్రస్తుత పరిణామాలు చైనీయుల మానసిక స్థితిపై ప్రభావం చూపుతాయని ప్రొఫెసర్ దీపక్ అన్నారు.భవిష్యత్తులో చైనా పెట్టుబడులు కూడా ప్రభావితమవుతాయని ఆయన అన్నారు. అంతే కాకుండా, ప్రజల సంబంధించినంత వరకు, భారతదేశంపై ఇష్టంతో గమ్యస్థానంగా ఎంచుకునే చైనా విద్యార్థుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని దీపక్ పేర్కొన్నారు. అల్కా ఆచార్య అనే నిపుణుడు మాట్లాడుతూ.. ఇటువంటి సంఘటన వల్ల స్వల్పకాలిక, మధ్యస్థ రెండు రకాల ప్రభావాలు ఉంటాయన్నారు.

Related Posts