వివాదాస్పద నటి శ్రీరెడ్డి లీక్స్ కొనసాగుతున్నాయి.టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పోరాటం చేస్తున్న నటి శ్రీరెడ్డి రోజుకో నటుడి వ్యక్తిగత విషయాల్ని ఆధారాలతో సహా బహిర్ఘతం చేస్తుంది. అంతేకాదు తాను చేస్తున్న పోరాటానికి ఇండస్ట్రీ నుంచి మద్దతులభించడంలేదని వాపోయింది. తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అర్థనగ్నంగా ఫిల్మ్ చాంబర్ దగ్గర నిరసన తెలిపిన శ్రీరెడ్డి అందరికి పెద్ద షాకే ఇచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత... తన నిరసన కొనసాగుతుందని... త్వరలోనే అందరి గుట్టు విప్పుతానని చెప్పింది. చెప్పినట్లుగానే తన లీక్స్‌ను మొదలు పెట్టింది. ఈ సందర్భంగా ఇండస్ట్రీ పెద్దలు తనని ఏ విధంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారో వెల్లడించింది. అర్థనగ్నంగా ఫిల్మ్ చాంబర్ దగ్గర నిరసన తెలిపిన శ్రీరెడ్డి అందరికి పెద్ద షాకే ఇచ్చింది. పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత... తన నిరసన కొనసాగుతుందని... త్వరలోనే అందరి గుట్టు విప్పుతానని చెప్పింది. చెప్పినట్లుగానే తన లీక్స్‌ను మొదలు పెట్టింది. ఈసారి వైవా హర్ష గుట్టును విప్పేసింది. హర్షతో చేసిన చాట్ మొత్తాన్ని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ది గ్రేట్ వైవా హర్ష... షార్ట్ ఫిల్మ్స్‌లో అవకాశాల కోసం సాయం కోరానంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి మరో సంచలనానికి తెరతీసింది. తనతో చనువుగా ఉన్న టాలీవుడ్‌కి చెందిన ఓ ప్రముఖుడి ఫోటోలను లీక్ చేసింది. తెలుగు సినిమా పరిశ్రమలో ఉన్న లోగుట్టును ఒక్కొక్కట్టిగా బయటపెడుతోంది కొంతకాలంగా సినీ ప్రముఖులకు నిద్రలు లేకుండా చేస్తున్న శ్రీరెడ్డి మరో అడుగు ముందుకు వేసింది. ఇటీవల హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ ముందు అర్ధనగ్న ప్రదర్శన చేసిన శ్రీరెడ్డి అందరి జాతకాలను బయటపెడతానంటూ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. తన వద్ద ఉన్న ఫోటోలను ఆ మీడియా సంస్థకు ఇచ్చింది. అయితే సదరు ఛానల్ ఆ వ్యక్తి ముఖం కనిపించకుండా ఫోటోలను బ్లర్ చేసి అవతల వాళ్ల వెర్షన్ కోసం వేసిచూస్తున్నామన్నారు.అయితే శ్రీరెడ్డి ఆ వ్యక్తి గుట్టును బహిర్గతం చేయాలని ఛానల్‌ను పదే పదే లైవ్‌లో వేడుకున్నా సుమారు 5 గంటల పాటు ఆ ఫోటోలను టెలికాస్ట్ చేయలేదు. దీంతో శ్రీరెడ్డి సదరు ఛానల్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూనే స్టుడియో నుండి నిష్క్రమించారు. అయితే సోషల్ మీడియాలో సదరు ఛానల్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ వస్తుండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో ముఖాలు కనిపించకుండా ఫోటోలను టెలికాస్ట్ చేశారు.అంతకు ముందు శ్రీరెడ్డి మాట్లాడుతూ.. తాను పబ్లిసిటీ కోసమే ఇదంతా చేస్తున్నాననే రూమర్‌కి చెక్ పెట్టి.. ఈ సస్పెన్స్ కు తెరదించాలని భావిస్తున్నానన్నారు. ఇప్పటికే కొంతమంది పేర్లు బయటపెట్టానని ఇక మిగిలిన వారందరి పేర్లూ కూడా లైవ్‌లో మీడియా సాక్షిగా లైవ్‌లో బయటపెట్టబోతున్నానని ప్రకటించారు శ్రీరెడ్డి. అయితే తనను ఓ ప్రముఖ వ్యక్తి హైదరాబాద్‌లో ఉన్న ఓ ప్రముఖ స్టుడియోలోకి తీసుకువెళ్లి ఏంచేశాడో.. ఆ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెడుతున్నా అంటూ సంచలన ప్రకటన చేసింది.ఇండస్ట్రీ లోని పెద్దల వల్ల ఎంతోమంది ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. అయినా మీ బెదిరింపులకు బయపడేరకలం కాదు. నేను మీకు చాలా చిన్నగా కనిపించవచ్చు. కానీ నా పోరాటం చిన్నది కాదు. ఈక కూడా పీకలేదు అనే మొండి ధైర్యానికి హాట్సాఫ్ అని శ్రీరెడ్డి పేర్కొన్నారు.