YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు విద్య-ఉపాధి తెలంగాణ

ఆన్ లైన్ క్లాసులు వేధింపులు : ఇద్దరు అరెస్ట్

ఆన్ లైన్ క్లాసులు వేధింపులు : ఇద్దరు అరెస్ట్

ఆన్ లైన్ క్లాసులు వేధింపులు : ఇద్దరు అరెస్ట్
హైద్రాబాద్, జూన్ 19
ఆన్‌లైన్ క్లాసుల పేరుతో విద్యార్థినులకు అసభ్యకర మెసేజ్‌లు పెట్టి వేధింపులకు గురిచేస్తున్న కీచక ఉపాధ్యాయుల బాగోతం హైదరాబాద్‌లో వెలుగుచూసింది. తొమ్మిదో తరగతి విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా.. ఆమె సెల్‌ఫోన్‌కి అశ్లీల మెసేజ్‌లు పంపడం తీవ్ర కలకలం రేపుతోంది. వేధింపులు భరించలేకపోయిన బాలిక షీ టీమ్స్‌ని సంప్రదించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.సైబరాబాద్ కమిషనరేట్ షాబాద్ పరిధిలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న బాలికకు ఆన్‌లైన్ క్లాసుల్లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. కీచకులుగా మారిన ఉపాధ్యాయులు శ్రీకాంత్, సురేందర్ ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా అసభ్యంగా ప్రవర్తించేవారు. అంతటితో ఆగకుండా ఆమె సెల్‌ఫోన్‌కి అశ్లీల మెసేజ్‌లు పంపిస్తూ వేధింపులకు గురిచేశారు. కొద్దికాలం మౌనంగా భరించిన బాలిక.. వేధింపులు ఎక్కువవడంతో షీ టీమ్స్‌ని సంప్రదించింది.
రహస్యంగా విచారణ జరిపిన సైబరాబాద్ పోలీసులు కీచక టీచర్లను అరెస్టు చేశారు. ఆన్‌లైన్ పాఠాల పేరుతో విద్యార్థులకు అసభ్యకరమైన మెసేజ్‌లు పెట్టి విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తే పీడీ యాక్ట్ చట్టాన్ని ప్రయోగిస్తామని సైబరబాద్ డీసీపీ అనసూయ హెచ్చరించారు. 9వ తరగతి విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభుత్వ ఉపాధ్యాయులు శ్రీకాంత్, సురేందర్‌ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.ఇద్దరు టీచర్లపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినుల తల్లిదండ్రలకు డీసీపీ పలు సూచనలు చేశారు. ఆన్‌లైన్ తరగతులు జరుగుతున్న సమయంలో విద్యార్థుల తల్లిదండ్రులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. ముఖ్యంగా తల్లి నిరంతరం గమనిస్తూ ఉండాలన్నారు. టీచర్లు పెట్టే మెసేజ్‌లను ఎప్పటికప్పుడు చూస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు.

Related Posts