YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

50 వేల కోట్లతో మరో కొత్త స్కీమ్

50 వేల కోట్లతో మరో కొత్త స్కీమ్

50 వేల కోట్లతో మరో కొత్త స్కీమ్
న్యూఢిల్లీ, జూన్ 19
రోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మరో కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధాని మోదీ జూన్ 20న గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ అభియాన్ స్కీమ్‌ను లాంచ్ చేస్తారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఆమె ఇప్పుడు మీడియాతో మాట్లాడున్నారు.గ్రామీణ ప్రాంతంలో ఉపాధి కల్పన లక్ష్యంగా ఈ పథకాన్ని తీసుకువస్తున్నామని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంతంలో నివసించే వారు, వెనుకకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. 6 రాష్ట్రాల్లో 116 జిల్లాల్లో ఈ స్కీమ్ అమలు చేస్తామని పేర్కొన్నారు. గరీబ్ కల్యాణ్ రోజ్‌గర్ అభియాన్ కింద దాదాపు 25 పథకాల సేవలను ఒకేచోటు అందిస్తామని వివరించారు.125 రోజుల పాటు ఈ కొత్త పథకం అందుబాటులో ఉంటుదన్నారు. దీని కోసం రూ.50 వేల కోట్లు వెచ్చిస్తామని తెలిపారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, ఝార్ఖండ్, ఒడిశాలలో ఈ పథకం అమలు చేస్తామని పేర్కొన్నారు. 12 మంత్రిత్వ శాఖల సమన్వయంతో ఈ పథకాన్ని పూర్తి స్థాయిలో సమర్థవంతంగా అమలు చేస్తామని పేర్కొన్నారు.ప్రస్తుతం వర్కర్లకు వెంటనే వచ్చే 4 నెలలపాటు ఉపాధి కల్పిస్తామని తెలిపారు. తర్వాత ఎంత మంది అలాగే కొనసాగుతారు లేదంటే ఇతర పనులకు ఏమైనా వెళ్లిపోతారా? అనే అంశంపై ఆధారపడి తర్వాతి నిర్ణయం ఉంటుందని పేర్కొన్నారు. 116 జిల్లాల్లో ప్రతి జిల్లాకు దాదాపు 25 వేల మంది వలస కార్మికులు తిరిగి వచ్చారని తెలిపారు. వీరికి ఉపాధి కల్పించడమే స్కీమ్ ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఇకపోతే బీహార్‌లోని తెలిహర్ గ్రామంలో ఈ స్కీమ్‌ను ప్రారంభించానున్నారు.

Related Posts