YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు ఆంధ్ర ప్రదేశ్

దివ్య ను క్రూర మృగాలకన్నా ఘెరంగా హింస

దివ్య ను క్రూర మృగాలకన్నా ఘెరంగా హింస

దివ్య ను క్రూర మృగాలకన్నా ఘెరంగా హింస
విశాఖపట్టణం, జూన్ 19
వైజాగ్ దివ్య మర్డర్ కేసులో తవ్వేకొద్దీ సంచలన నిజాలు బయటికొస్తున్నాయి. పోలీసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అమ్మాయిల శరీరాలతో వ్యాపారం చేస్తున్న వ్యభిచార ముఠాలు క్రూర మృగాలకన్నా ఘెరంగా దివ్యని హింసించి చంపినట్లు వెల్లడవుతోంది. కుటుంబ సభ్యుల మరణంతో అనాథగా మారిన దివ్యని చేరదీసిన పిన్ని డబ్బు కోసం ఆమెని బలవంతంగా వ్యభిచార కూపంలోకి దించింది. అంతటితో ఆగకుండా ఆమెని లక్ష రూపాయలకు మరో వ్యభిచార నిర్వాహకురాలికి అమ్మేసింది. అక్కడి నుంచి దివ్య చేతులు మారుతూ వసంత వద్దకొచ్చినట్లు తేల్చారు. దివ్య అందానికి వేలాది రూపాయలు వచ్చి పడుతుండడంతో బంగారు బాతులా భావించిన వసంత.. ఆమెని వదిలేందుకు ఒప్పుకోలేదు. బలవంతంగా విటుల వద్దకు పంపించి భారీగా సంపాదించాలన్న దురాశతో దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. తనకు కనీసం డబ్బులు ఇవ్వట్లేదని దివ్య ఎదురుతిరగడంతో ఆమెను అంధ విహీనంగా చేసి.. ఆ తరువాత దారుణంగా హింసించి చంపినట్లు పోలీసు విచారణలో తేలింది,కుటుంబ సభ్యుల మరణంతో దివ్య అనాథగా మారింది. అమ్మమ్మ, అమ్మ, సోదరుడు చనిపోవడంతో ఒంటరిగా మిగిలిన దివ్యని ఆమె పిన్ని కాంతివేణి చేరదీసింది. అప్పటికే వ్యభిచార వృత్తిలో ఉన్న కాంతివేణి చూపు దివ్యపై పడింది. కూతురు అవుతుందన్న కనీస కనికరం లేకుండా ఆమెతో డబ్బులు సంపాదించాలని నీచానికి ఒడిగట్టింది. దివ్యని బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపింది. విటుల వద్దకు పంపించి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టింది. దివ్య అందం ఆమెకి కలిసొచ్చింది. ఆమెను అడ్డుపెట్టుకుని వేలాది రూపాయలు ఆర్జించింది. అంతటితో ఆగని పిన్ని కాంతివేణి ఆమెని మరో వ్యభిచార గృహ నిర్వాహకురాలికి అమ్మేసిందిదివ్యతో వ్యభిచారం చేయించి డబ్బులు సంపాదించిన కాంతివేణి.. వైజాగ్‌కి చెందిన వ్యభిచార నిర్వాహకురాలు గీతకి అమ్మేసింది. లక్ష రూపాయలకు దివ్యని అమ్మేసినట్లు పోలీసులు గుర్తించారు. అందుకు సంబంధించిన కీలక ఆధారాలను సేకరించాడు. దివ్యని కొనుక్కున్న గీత అకౌంట్ నుంచి కాంతివేణి సహజీవనం చేస్తున్న కృష్ణ అకౌంట్‌కి లక్ష రూపాయలు ట్రాన్స్‌ఫర్ అయినట్లు గుర్తించారు. తన వద్దకు చేరిన దివ్యతో గీత వ్యభిచారం చేయించింది. ఆమెను విటుల వద్దకు పంపించి డబ్బులు సంపాదించింది. అనంతరం దివ్యని కేసులో ప్రధాన నిందితురాలైన వసంత వద్దకి పంపినట్లు పోలీసుల విచారణలో తేలిందకాంతివేణి వ్యభిచార వృత్తిలో దింపిన తరువాత దివ్య పలువురు వ్యభిచార నిర్వాహకుల చేతులు మారుతూ వసంత వద్దకు చేరింది. అందంగా ఉన్న దివ్యకి డిమాండ్ బాగా ఉండడంతో ఆమెను అడ్డుపెట్టుకుని రోజుకు వేలాది రూపాయలు సంపాదించింది. దివ్యని బంగారుబాతులా భావించిన వసంత.. ఆమెతో భారీగా డబ్బు సంపాదించాలని దురాశకు పోయింది. బలవంతంగా విటువ వద్దకు పంపించి హింసించేది. దివ్యని తిరిగి పంపించాలని గీత అడిగినా ఆమెని పంపలేదు. ఆమె ఎక్కడికో వెళ్లిపోయిందంటూ కట్టుకథ అల్లింది. రోజుకు వేలల్లో సంపాదిస్తున్నా తనకు డబ్బులు ఇవ్వడం లేదని దివ్య ఎదురుతిరగడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.డబ్బుల కోసం దివ్య ఎదురుతిరగడంతో వసంత కోపంతో రగిలిపోయింది. అందంగా ఉందన్న గర్వంతోనే తనకు ఎదురుతిరిగిందని.. ఆమెని అంధవిహీనంగా మార్చాలని నిర్ణయించుకుంది. గదిలో పెట్టి చిత్రహింసలకు గురిచేసింది. ఆమెకి గుండుకొట్టించి.. కనుబొమ్మలు గీయించింది. ఒంటిపై వాతలు పెట్టి చిత్రవధ చేసింది. నాలుగైదు రోజులపాటు భోజనం పెట్టకుండా గదిలోనే బంధించింది. ఒంటిపై సిగరెట్లతో కాల్చిన గాయాలు కుళ్లి.. ఆహారం లేక ఆకలితో అలమటించి దివ్య ప్రాణాలు విడిచింది. ఆమె చనిపోవడంతో శవాన్ని మాయం చేసేందుకు శతవిధాలా ప్రయత్నించింది. అర్ధరాత్రి వేళ గుట్టుచప్పుడు కాకుండా శవాన్ని ఖననం చేసి చేతులుదులుపుకోవాలని భావించి అడ్డంగా దొరికిపోయింది. పోలీసు విచారణ కొనసాగుతోంది.

Related Posts