లబోదిబోమంటున్న మామిడి రైతులు
తిరుపతి,జూన్ 19
చిత్తూరు జిల్లలో మామిడి రైతులు లబోదిబోమంటున్నారు.కనీస మద్దతు ధర రాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం ఇచ్చే ధరలు కనీసం కూలీలకు కూడా సరిపోవడం లేదని రైతులు వాపోతున్నారు. పంట సాగు కోసం వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టితే ఈసారి ప్రస్తుతం ఉన్న ధరలు కనీసం పెట్టు బడులకు వడ్డీలు కూడా గిట్టు బాటు కాని పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఈ జిల్లాలోనే ఎక్కవ మామిడి గుజ్జు పరిశ్రమలు ఉన్నాయి. గతంలో చిత్తూరు జిల్లాలో పండిన కాయలనే ఇక్కడ మామిడి గుజ్జుకు వినియోగించే వారు. ఈసారి తమిళనాడులో కూడా పంట ఎక్కవ కావడంతో అరాష్ట్రం నుంచి తక్కువ ధరలకు కాయలను గుజ్జు పరిశ్రమలుకు సరఫరా చేస్తున్న నేపధ్యంలో ఈజిల్లాలో పండిన కాయలను అడిగే నాధుడే కరవయ్యారు. ఒక్కసారిగా ధరలు పతనావస్తకు చేరుకొన్నాయి. మరోపక్క మార్కెట్ యార్డుల్లో వ్యాపారస్తులు, మామిడి గుజ్జు యజమానులు సిండికేట్ అయ్యి ధరలను నిర్ణయించడంతో ఈ ధరలు ఏమాత్రం గిట్టుబాటు కాకపోవడంతో రైతులు ఆందోళన బాట పట్టారు. మరో పక్క సీజన్ ముగుస్తున్న తరుణంలో కాయలను నిల్వ ఉంచు కోలేక, ఆశించిన ధరలు లేక పోవడంతో మామిడి రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపధ్యంలో జిల్లాలో మామిడికి గిట్టు బాటు ధరలు కల్పించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టంది. దీంతో పలు మార్లు జిల్లాలోని రైతు ప్రతినిధులు, మామిడి గుజ్జు పరిశ్రమల యజమానులతో చర్చించి గిట్టు బాటు ధరలు నిర్ణయించాలని సూచించారు. నేటికి ధరుల నిర్ణయించక కాలయాపన చేస్తూండటంతో ఈ ధరుల నిర్ణయం ప్రశ్నార్థకంగా మారింది. మరోపక్క ఒక్కసారిగా జిల్లాలో వాతావరణ పరిస్థితులు మారి పోవడంతో కాయలు చెట్ల నుంచి రాలి పోతున్నాయి, కారణంగా పంటకు కనీస మద్దతు ధరలు వస్తే విక్రయాలు చేయాలని రైతులు ఆశిస్తున్నా ధరలు నిర్ణయంపై జాప్యం జరుగుతుండంతో అన్ని విధాలుగా మామిడి రైతులు నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మామిడికి గిట్టు బాటు ధరలు కల్పించే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.