YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

 అనంతపురంలో టీడీపీకి కష్టకాలమే

 అనంతపురంలో టీడీపీకి కష్టకాలమే

 అనంతపురంలో టీడీపీకి కష్టకాలమే
అనంతపురం, జూన్ 19
లుగుదేశంపార్టీ కి కంచుకోటగా ఒకప్పుడు ఉన్న అనంతపురం జిల్లా ఇప్పుడు బీటలు వారుతుంది. దీనికి టిడిపి యువరాజు పర్యటనే తార్కాణంగా చెప్పొచ్చు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణ ఇలా ఎవరి పర్యటనలు అక్కడ ఉన్నా జనం పోటెత్తిపోయేవారు. దీనికి కారణం పార్టీలో బలమైన నేతలు చాలా మంది అక్కడి వారే కావడం. పరిటాల రవి కుటుంబం పార్టీ స్థాపన నుంచి టిడిపి నే అంటిపెట్టుకుని ఉంది. అలాగే జిల్లా అధ్యక్షుడు హనుమంత రాయ చౌదరి వంటివారు తో పాటు పయ్యావుల కేశవ్ వంటి సీనియర్లు అనంతపురం బ్రాండ్స్ గానే పేరుపొందారు. ఇప్పుడు వీరంతా చినబాబు లోకేష్ టూర్ కి డుమ్మా కొట్టేశారు. మొబైల్స్ సైతం బంద్ పెట్టి ఇళ్లల్లోనే ఉండిపోయారని పార్టీ వర్గాల్లో యమా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.వాస్తవానికి జెసి దివాకర రెడ్డి కుటుంబానికి టిడిపి లో ఆది నుంచి ఉంటున్న వారికి దశాబ్దాలనుంచి పొసగదు. కాంగ్రెస్ ఎపి లో పతనం అయ్యాక వైసిపి లోకి పోలేక తెలుగుదేశం పంచన చేరింది జెసి ఫ్యామిలీ. వారు వచ్చింది మొదలు అధినేత చంద్రబాబు జెసి బ్రదర్స్ కి ఇచ్చిన ప్రయారిటీ అంతా ఇంతా కాదు. జగన్ ను ధీటుగా ఎదుర్కోవాలంటే, బూతులు తిట్టించడానికి వీరికన్నా మొనగాళ్లు టిడిపి లో లేరని బాబు వారికి అగ్రతాంబూలం ఇచ్చేశారు. అయితే ఇక్కడే అనంతపురం లో ఆది నుంచి పార్టీని నమ్ముకున్న వారికి కాలింది. ఆస్తులు అమ్ముకుని ప్రాణాలు ఫణంగా పెట్టి దశాబ్దాలుగా పార్టీకి సేవలు చేస్తున్న వారిని కాదని జెసి బ్రదర్స్ ను చంకను ఎక్కించుకోవడాన్ని పాత టిడిపి బ్యాచ్ సహించలేకపోతున్నారు. బాబు ఈక్వేషన్స్ వారికి పూర్తిగా అనవసరం. ఎవరు అధికారంలో ఉంటె వారికి భజన చేసేవారికి ఇచ్చే ప్రాధాన్యత తమకెందుకు లేదన్నది తమ్ముళ్ల ఆవేదన. నిజంగా కూడా వారి బాధలో అర్ధం ఉంది.అయితే దీనిని పసుపు పార్టీ అధిష్టానం మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ రీజన్ తోనే జెసి ప్రభాకర రెడ్డి, అస్మిత్ రెడ్డి అరెస్ట్ పై వారి కుటుంబాలను పరామర్శించేందుకు లోకేష్ వచ్చినా ఇది తమకు సంబంధం లేని వ్యవహారంగానే వారు మిన్నకుండిపోయారు. పార్టీ నేతల అరెస్ట్ పై బాబు ఇచ్చిన పిలుపునకు రాష్ట్రవ్యాప్తంగా తమ్ముళ్లు పెద్దఎత్తునే ఆందోళనలు జరిపినా అనంత లో మాత్రం ఈ వ్యవహారంలో అంతంత మాత్రం తమ్ముళ్లు స్పందించడానికి అధిష్టానంపై ఉన్న గుస్సా నే రీజన్ అని లోకేష్ టూర్ తేల్చేసింది. ఈ నేపథ్యంలో పార్టీ అధిష్టానం వీరిని బుజ్జగించకపోతే మాత్రం అనంతపురంలో టిడిపి ఒకప్పుడు అనే పరిస్థితి వచ్చి ఉన్నవారంతా మూటాముల్లె సర్దుకుని ఫ్యాన్ కిందకు చేరతారని పసుపు జనంలో బాగా వినిపిస్తున్న చర్చ.
 

Related Posts