YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్ మౌనం దేనికి అర్ధం

జగన్ మౌనం దేనికి అర్ధం

జగన్ మౌనం దేనికి అర్ధం
విజయవాడ, జూన్ 19,
ఒక్కోసారి మౌనం అనర్థాలకు దారి తీస్తుంది. కొందరు చేతకాని తనంగా కూడా భావిస్తారు. మరికొందరు అడ్వాంటేజీగా తీసుకుంటారు. ఏపీలో జగన్ విషయంలో అదే జరుగుతుంది. ఎప్పుడయితే యాక్షన్ లేదో.. అప్పుడే వాయిస్ పెరుగుతూ వస్తుంది. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ బాధ్యతలను చేపట్టి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది కాలంలో జగన్ తక్కువ పనులేమీ చేయలేదు. క్షేత్రస్థాయిలోకి వెళ్లితే కోట్లాది కుటుంబాలకు ప్రయోజనం చేకూర్చారు. భవిష్యత్తులో పార్టీకి ప్రయోజనం చేకూరడానికే జగన్ ఏడాది నుంచి అనేక పథకాలను గ్రౌండ్ చేయగలిగారు.కాని కొందరు సీనియర్ నేతలు, ఎంపీలు దీనిని తట్టుకోలేకపోతున్నారు. ప్రధానంగా నియోజకవర్గాల్లో తమ మాట చెల్లుబాటు కావడం లేదన్న అసహనమే ఎక్కువగా వారిలో కన్పిస్తుంది. లేకుంటే జగన్ ఏడాది పాలనపై విమర్శలు చేయాల్సిన పనిలేదు. పార్టీ మేలు కోరుకునే వారే అయితే జగన్ తో అపాయింట్ మెంట్ దొరకకుంటే సీఎంవో అధికారులకు చెప్పవచ్చు. లేకుంటే జగన్ కు దగ్గరగా ఉండేవారికి చేయవచ్చు. కానీ బయటకు వచ్చి రచ్చ చేస్తున్నారంటేనే భయంలేకపోబట్టేననేది అర్థమవుతుంది.వైసీపీ ఎంపీ రఘురామ కృష‌్ణంరాజు విషయమే తీసుకుంటే ఆయనను ఆరు నెలల నుంచి జగన్ ఉపేక్షిస్తూ వస్తున్నారు. ఇంగ్లీష్ మీడియంపైన రఘురామకృష్ణంరాజు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినప్పుడే జగన్ స్పందించి ఉంటే ఇక్కడి వరకూ రాకపోయి ఉండేది. ఆయనను లైట్ గా తీసుకోవడం, పోటీగా మరొకరని ఇన్ ఛార్జిగా పెట్టడంతో రఘురామకృష్ణంరాజు ఓపెన్ అవుతున్నారు. పార్టీ నిర్ణయాలపై సొంత పార్టీ నేతలే దాడి చేస్తున్నారు. ఇది ఒకరకంగా జగన్ మౌనాన్ని అలసుగా తీసుకున్నట్లే అంటున్నారు.జగన్ ఇదే వైఖరి కొనసాగిస్తే మరింత మంది నేతలు కూడా రాజుగారి బాట పట్టే అవకాశం స్పష్టంగా కన్పిస్తుంది. రోజులు గడిచే కొద్దీ అధినాయకత్వంపై అసహనం పెరిగే అవకాశముంది. ఎందుకంటే ఇప్పటి వరకూ జగన్ ఎమ్మెల్యేల చేతులు కట్టేశారు. వాలంటీర్ల వ్యవస్థపైనే జగన్ నమ్మకం పెట్టుకున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఉత్సవ విగ్రహాలుగా మారారు. దీంతో జగన్ పార్టీ నిర్ణయాలను బహిరంగంగా వ్యతిరేకిస్తున్న వారిపై చర్యలు తీసుకోకుంటే చేతకాని తనంగానే భావిస్తారని చెప్పక తప్పదు. మరి జగన్ మౌనాన్ని కొనసాగిస్తారో? యాక్షన్ లోకి దిగుతారో? చూడాల్సి ఉంది.

Related Posts