మెగా కుటుంబంలో పెళ్ళి సందడి
హైద్రాబాద్, జూన్ 19
మెగా కుటుంబంలో పెళ్ళి సందడి మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి పెద్ద తమ్ముడు నాగబాబు కూతురు నిహారిక త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నట్టు చిన్న హింట్ ఇచ్చింది. పోస్ట్‌లో ఓ కాఫీ కప్‌పై ‘మిస్ నిహారిక’ అని రాసి ఉంది. ఆ తర్వాత మిస్ అనే పదాన్ని కొట్టేసి దాని కిందే మిసెస్ అని రాసి పక్కన క్వశ్చన్ మార్క్ పెట్టింది. అంతేకాకుండా `ఉహ్.. వాట్?` అనే కామెంట్‌ను కూడా జత చేసింది. దీంతో మెగా అభిమానులు నిహారిక పెళ్లిపై ఆసక్తికర చర్చలు జరిపారు. ఇంతకీ మెగా ఫ్యామిలీకి కాబోయే అల్లుడెవరు? అతని కుటుంబ నేపథ్యం ఏంటనే దానిపై అన్వేషణ ప్రారంభించారు.కాఫీ కప్ తో పాటు ఓ అబ్బాయితో కలిసిన రొమాంటిక్ ఫోటో కూడా విడుదల చేయడంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగింది. నిహారిక పెళ్ళి చేసుకోబోయే వ్యక్తి ఇతనే అంటూ ఓ ఫోటో చక్కర్లు కొడుతుంది. ఇందులో నిహారిక ఆ వ్యక్తిని హగ్ చేసుకొని ఫేస్‌ని కవర్ చేసింది. ఇతనే నిహారిక పెళ్లి చేసుకోబోయే వ్యక్తి అని అభిమానులు కన్ ఫర్మ్ చేసేశారు. గుంటూరుకు చెందిన ఓ గవర్నమెంట్ అధికారి కొడుకు అని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక వార్త రానున్నట్లు గట్టిగా వినిపిస్తుంది.కాగా ఒక మనసు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నిహారిక రెండు మూడు తెలుగు చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. పింక్ ఎలిపెంట్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి కొన్ని వెబ్ సిరీస్ లు కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. నాగబాబు తన మిత్రుడైన గుంటూరు జిల్లాకు చెందిన IG జొన్నలగడ్డ ప్రభాకర్ రావు తనయుడు జొన్నలగడ్డ వెంకట చైతన్య అని , చైతన్యతో త్వరలో పెళ్ళి చేయాలనుకుంటున్నట్లు తెలుస్తుంది.గతంలో 3-4 సార్లు మెగా ఫ్యామిలీలో జరిగిన ఫంక్షన్స్ కి అటెండ్ అయినప్పుడు అబ్బాయి ప్రవర్తన నచ్చి మెగా సోదరులు అతడిని నిహారికకి ఇచ్చి చేయాలని నిర్ణయించుకున్నారంటున్నారు. అబ్బాయి గురించి చిరంజీవి కూడా వాకబు చేసి తమ్ముడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. ఏప్రిల్-మే 2021లో వీరి పెళ్ళికి ముహూర్తం పెట్టనున్నారు. ఆగస్టులో వీరికి నిశ్చితార్థం జరగనుంది.తన పెళ్లికి సంబంధించి నిహారిక నిన్న సోషల్ మీడియా ద్వారా చిన్న క్లూ కూడా ఇచ్చారు. మిస్టర్ అండ్ మిసెస్ నిహారిక అని చివరన ప్రశ్నార్థకం పెట్టారు. అంటే, పెళ్లికొడుకు ఎవరో మనమే గెస్ చేయాలని ఆమె ఉద్దేశం. అందుకే, ఇండస్ట్రీ వర్గాలు గెస్ చేసేశాయి. నిహారికకు కాబోయే భర్త గురించి ఇండస్ట్రీ ఇంటెలిజెన్స్ వర్గాలు సమాచారం రాబట్టాయి. అబ్బాయిది గుంటూరు అని అంటున్నారు. పేరు చైతన్య అట. ఓ ప్రభుత్వ ఉన్నతాధికారి కుమారుడట ఈ చైతన్య. హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో ఆయన పనిచేస్తున్నారట.ఇది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని అంటున్నారు. నిహారిక, చైతన్య రెండు మూడు సార్లు కలిసి మాట్లాడుకున్నారట. ఒకరి గురించి ఒకరు తెలుసుకున్న తరవాత పెళ్లికి అంగీకారం తెలిపారని.. దీంతో ఇరు కుటుంబాల పెద్దలు పెళ్లిని నిశ్చయించుకున్నారని సమాచారం. అయితే, ఇంకా పెళ్లి తేదీని ఖరారు చేయలేదని తెలిసింది. ఆగస్టులో నిశ్చితార్థం ఉండొచ్చని, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న ఈ రూమర్‌లో నిజమెంతో తేలాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.