YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

 ఎంసెట్ దరఖాస్తులు పెరుగుదల

 ఎంసెట్ దరఖాస్తులు పెరుగుదల

 ఎంసెట్ దరఖాస్తులు పెరుగుదల
హైద్రాబాద్, జూన్ 20
ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, మెడికల్‌ (ఫార్మసీ, వెటర్నరీ) కోర్సుల్లో ప్రవేశాలకు రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంసెట్‌ పరీక్షకు దరఖాస్తుల సంఖ్య గతంతో పోలిస్తే భారీగా పెరిగినట్లు సమాచారం. గతేడాది మొత్తం 2.16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.ఈ ఏడాది ఇప్పటి వరకు ఆలస్య రుసుముతో మరో పది రోజులు పైగా గడువు ఉండగానే నాటికి 2.20 లక్షల దరఖాస్తులు అందినట్లు తెలుస్తోంది. గత ఏడాదితో పోలిస్తే ఇంతవరకు 3,556 దరఖాస్తులు అధికంగా వచ్చాయి. కరోనా భయంతో ఇతర రాష్ట్రాలపై తెలుగు విద్యార్థులు ఆసక్తి చూపకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది.మొత్తం దరఖాస్తుల్లో ఇంజనీరింగ్‌కు 1,42,168 మంది, అగ్రికల్చర్‌, మెడికల్‌ కోర్సులకు 78,369 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఎంసెట్‌ కోసం రూ. 1000 ఆలస్య రుసుముతో ఈ నెల 20 వరకు, రూ 5 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 25 వరకు, రూ. 10 వేల ఆలస్య రుసుముతో ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.దరఖాస్తు ముగిసేలోగా అప్లికేషన్ల సంఖ్య మరింతగా పెరిగే అవకాశాలున్నాయని జేఎన్‌టీయూ వర్గాల సమాచారం. కరోనా కారణంతో విద్యార్థులు, తల్లిదండ్రుల దృక్పథంలో వచ్చిన మార్పే ఈ సారి దరఖాస్తులు పెరగడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. జులై 6 నుంచి 9 వరకు టీఎస్‌ ఎంసెట్‌ జరుగనున్న విషయం తెలిసిందే.

Related Posts