YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ! 

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ! 

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ! 
ఎఐసిసి జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి 
షాద్ నగర్ జూన్ 19 
ఓవైపు కరోనా మహమ్మారి దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తుంటే.. మరోవైపు భారత చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొని భారత జవాన్లు అమరులయ్యారనీ, ఇలాంటి వేళ దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, అందుకే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ జన్మదినాన్ని దేశవ్యాప్తంగా ఆర్భాటంగా జరపడం లేదని  ఏఐసీసీ జాతీయ కార్యదర్శి చల్లా వంశీచంద్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సంక్షోభ సమయంలో దేశ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వారికి సామాజిక సేవలతో ఆదుకోవాలనే దృక్పథంతో కాంగ్రెస్ పార్టీ ప్రథమ కర్తవ్యంగా భావించి నేడు ముందుకు కదులుతుందని ఆయన అన్నారు.  శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో ఆయన కాంగ్రెస్ శ్రేణులతో మాట్లాడారు. స్థానిక కాంగ్రెస్ సీనియర్ నేత వీర్లపల్లి శంకర్ స్వగృహంలో ఏర్పాటుచేసిన ముఖ్య శ్రేణుల సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాదయ్య, టిపిసిసి సభ్యులు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్,  బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బాలరాజ్ గౌడ్, జిల్లెల రాం రెడ్డి, సుదర్శన్ గౌడ్, జంగ నరసింహులు, కొంకళ్ల చెన్నయ్య, ఆయా మండల పార్టీల అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు నియోజకవర్గంలో ఎలికట్ట, షాద్ నగర్, నందిగామ, రంగాపూర్ తాండ ప్రాంతాల్లో పర్యటించి వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ.. భావి తరాల నేత రాహుల్ గాంధీకి దేశాన్ని ముందుకు నడిపే శక్తియుక్తులను ప్రసాదించి దేశ విచ్ఛిన్నకర శక్తులను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి యుక్తులను ఆయనకు భగవంతుడు ప్రసాదించాలని    ఆయన అభిలాషించారు.దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న కారణంగా రాహుల్ గాంధీ జన్మదినాన్ని అట్టహాసంగా చేపట్టడం లేదని ఆయన స్పష్టం చేశారు.  ఈ సంక్షోభ సమయంలో ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక సైనికుడై పేద ప్రజలను ఆదుకోవాల్సిన కనీస బాధ్యత ఉందన్నారు అదేవిధంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో పార్లమెంట్ అధ్యక్షులు కొవ్వూరి పురుషోత్తం రెడ్డి నేతృత్వంలో నగర్ మండలం గ్రామంలో వెలికట్ట గ్రామం లో జాతీయ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల కలుసుకొని వారికి శానిటైజర్ మాస్కులు పండ్లు పంపిణీ చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య కార్మికులను కూడా సన్మానించడం జరిగిందన్నారు. అదేవిధంగా పట్టణంలోని ని ఆశ్రమ వృద్ధాశ్రమంలో చీరలు దుప్పట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం ఆనందంగా ఉందన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన వివరించారు కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీకి  సైనికులా నిలిచిన కార్యకర్తలకు ఆయన అభినందించారు. 

Related Posts