ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ మందు
జెనివా జూన్ 19
ఈ ఏడాది చివరికల్లా కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. కరోనా వైరస్ ఔషథ ప్రయోగాలపై జెనీవాలో జరిగిన మీడియా సమావేశంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య కార్యదర్శి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ మాట్లాడారు. పది మందిపై వ్యాక్సిన్ క్లినికల్ ప్రయోగం జరుగుతోందని వివరించారు. వారిలో కనీసం ముగ్గురు వ్యాక్సిన్ సామర్థ్యాన్ని రుజువు చేసే ప్రయోగం మూడో దశకు చేరుకున్నారన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పినట్లు హైడ్రాక్సిక్లోరోక్విన్కి కోవిడ్ మరణాలను నివారించే శక్తి లేదని తమ పరిశోధనలు, ప్రయోగాలలో తేలిపోయిందని ఆమె స్పష్టం చేశారు.