YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
న్యూఢిల్లీ, జూన్ 19
కరోనా కారణంగా మార్చిలో వాయిదా పడ్డ రాజ్యసభ స్థానాలకు ఎన్నిక ముగిసాయి. మొత్తం 9 రాష్ట్రాల్లో 20 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు.ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌లో 4, జార్ఖండ్‌లో 2, మధ్యప్రదేశ్ 3, రాజస్థాన్‌లో 3, మణిపూర్, మేఘాలయలో ఒక్కో సీటుకు ఎన్నికలు జరగున్నాయి. మిగిలిన ఆరు సీట్లలో కర్ణాటకలో నాలుగు సీట్లు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగిపోయింది. అరుణాచల్ ప్రదేశ్ ఒకటి, మిజోరాంలో మరో సీటు ఉంది. అరుణాచల్‌కు చెందిన రాజ్యసభ ఎంపీ జూన్ 25న, మిజోరాం ఎంపీ జూలై 18న పదవీకాలం పూర్తి చేసుకోనున్నారు.కర్ణాటకలో నలుగురి పదవీకాలం జూన్ 25తో ముగుస్తుంది. 50 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ జీవితంలో మాజీ ప్రధాని దేవెగౌడ తొలిసారి పెద్దల సభకు ఎన్నికయ్యారు. 1996లో ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యసభలో అడుగుపెట్టారు. ఇప్పుడు పెద్దల సభకు నేరుగా ఎన్నికయ్యారు. మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింథియా, మరో సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్, జార్ఖండ్ నుంచి శిబు సోరెన్ లాంటి సీనియర్ నాయకులు ఈసారి రాజ్యసభ రేసులో ఉండటం విశేషంమరోవైపు గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీగా సాగనున్నాయి. గుజరాత్‌లోని నాలుగు సీట్లకు బీజేపీ ముగ్గురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఇక కాంగ్రెస్ ఇద్దరిని రేసులో ఉంచింది. దీంతో కాంగ్రెస్ పోటీలో ఉన్న ఇద్దరు గెలుస్తారా ? లేక బీజేపీ తరపున బరిలో ఉన్న ముగ్గురు విజయం సాధిస్తారా ? అన్నది ఉత్కంఠగా మారింది. ఇక మధ్యప్రదేశ్‌లోని మూడు సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపింది. దీంతో రెండు పార్టీల్లో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. కొద్ది నెలల క్రితం ఈ రాష్ట్రంలో అధికారం కాంగ్రెస్ నుంచి బీజేపీ సొంతమైంది. ఇక రాజస్థాన్‌లోనూ ఇరు పార్టీ మధ్య పోటీ గట్టిగానే ఉంది. మూడు సీట్ల కోసం కాంగ్రెస్, బీజేపీ చెరో ఇద్దరు అభ్యర్థులను బరిలోకి దింపిందిమరోవైపు ఏపీ విషయానికి వస్తే నాలుగు సీట్లకు గాను ఐదుగురు పోటీలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, వ్యాపారవేత్త, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మరో వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు.

Related Posts