YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

షియామి ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

షియామి ప్రతినిధులతో చంద్రబాబు భేటీ

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో షియామి సంస్థ ప్రతినిధులు బుధవారం ఉదయం సమావేశమయ్యారు. . సమావేశంలో మంత్రులు నారా లోకేశ్, అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు. శ్రీసిటీ, తిరుపతి ఈఎంసీ-2 ప్రాంతాల్లో షియామి కంపెనీ ఏర్పాటుపై చంద్రబాబు ప్రతినిధులతో చర్చించారు.  రూ.4వేల కోట్లతో షియామి సంస్థ సెల్ఫోన్ పరికరాల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఏపీ, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాల్లో షియామి సంస్థ పెట్టుబడులు పెట్టే యోచనలో ఉంది. పెట్టుబడులకు ఉన్న ప్రయోజనాల, అవకాశాలను మంత్రి లోకేశ్ మంగళవారమే  షియామి ప్రతినిధులకు వివరించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ  రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయి. షియామీ సంస్థ ముందుకు వస్తే అన్నివిధాల సహకారం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శ్రీ సిటీ , తిరుపతి మధ్యలో సంస్థ ముందుకు వస్తే కేటాయింపులకు సిద్ధమన్నారు. షియామీ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులు పెడితే 40-50 వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయని అన్నారు. రాయలసీమ ప్రాంతంలో ఎక్కువ పరిశ్రమలు ఏర్పాట్లు చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు.

Related Posts