YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం దేశీయం విదేశీయం

 చైనాకు భారత్ షాక్

 చైనాకు భారత్ షాక్

 చైనాకు భారత్ షాక్
న్యూఢిల్లీ, జూన్ 19,
గాల్వన్ లోయలో ఘర్షణలకు కారణమై 20 మంది భారత సైనికుల ప్రాణాలను బలి తీసుకున్న చైనాపై దేశవ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ ప్రముఖులు, పలువురు సెలబ్రిటీలు కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. చైనా సంస్థకు కేటాయించిన రూ.471 కోట్ల విలువైన ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. పనులకు సంబంధించి ఇంతవరకు ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.కాన్పూర్‌ - దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ సెక్షన్‌ మధ్య 417 కి.మీ. మేర టెలీ కమ్యూనికేషన్, సిగ్నలింగ్ ప్రాజెక్టుకు సంబంధించి భారతీయ రైల్వేకు చెందిన డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (డీఎఫ్‌సీసీఐఎల్) చైనా సంస్థ ‘బీజింగ్ నేషనల్ రైల్వే రీసెర్చ్‌ అండ్ డిజైన్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్’ తో 2016లో ఒప్పందం చేసుకుంది. ఈ కాంటాక్ట్ విలువ రూ.471 కోట్లు.ఒప్పందం ప్రకారం బీజింగ్ సంస్థ.. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన టెక్నికల్ డాక్యుమెంట్లు ఇవ్వలేదని, ఇంజినీర్లు, ఇతర సిబ్బందిని తమకు కేటాయించలేదని డీఎఫ్‌సీసీఐఎల్ తెలిపింది. ఒప్పందం కుదిరి నాలుగేళ్లు అవుతున్నా ఇంతవరకు 20 శాతం పనులు కూడా పూర్తికాలేదని వెల్లడించింది. దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది.గాల్వన్‌ లోయ ఘటనను కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది. చైనాపై ఆర్థికపరమైన చర్యలు చేపట్టాలని భారత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. భారత్‌లో హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న సుమారు 100 రకాల చైనా ఉత్పత్తులపై నిషేధం విధించనున్నట్లు సమాచారం. చైనాపై కఠినమైన ఆర్థిక ఆంక్షలను అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Related Posts