YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం విదేశీయం

 ఒప్పందంలో భాగంగానే రాళ్లు వినియోగం

 ఒప్పందంలో భాగంగానే రాళ్లు వినియోగం

 ఒప్పందంలో భాగంగానే రాళ్లు వినియోగం
న్యూఢిల్లీ, జూన్ 19,
చైనాతో సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ వెంబడి పెట్రోలింగ్ నిర్వహించే భారతీయ సైనికులు తమ వెంట రైఫిళ్లు, తుపాకీలను తీసుకువెళతారు. కానీ, చైనా పీపుల్స్ ఆర్మీతో చర్చలకు మాత్రం సాధారణంగా నిరాయుధులై లేదా ఆయుధాలను దాచిపెట్టి ఓ సైనిక బృందం వెళుతుంది. చైనాతో ఉన్న సరిహద్దు నిర్వహణ ఒప్పందం ప్రకారం ఆయుధాలతో కాల్పులు జరపడం చేయరాదు. ఇరు దేశాల మద్య 1996లో కుదిరిన ఈ ఒప్పందాన్ని భారత సైన్యం తూ.చ. తప్పకుండా పాటిస్తోంది. ఎల్ఏసీకి 2 కిలోమీటర్ల పరిధిలో కాల్పులు జరపడం లేదా పేలుళ్లకు పాల్పడటం చేయరాదని ఈ ఒప్పందం చెబుతుందసోమవారం రాతి గాల్వన్ లోయ వద్ద జరిగిన ఘర్షణలో చైనా క్రూరంగా వ్యవహరించింది. మేకులతో కూడిన ఇనుప రాడ్లు, రాళ్లు, కర్రలతో విచక్షణ రహితంగా చైనా సైనికులు దాడికి పాల్పడి, 20 మంది భారత జవాన్లను పొట్టనబెట్టుకున్నారు. దీంతో, సరిహద్దు నిర్వహణ ఒప్పందంపై భారత్ పునరాలోచనలో పడింది.భారత సైనికులు నిరాయుధులై ఉండటం ఒక పెద్ద వివాదానికి దారితీసింది. భారత సైనికులు ఎందుకు దారుణమైన దాడిని ఎదుర్కొంటున్నారని వారి ఆయుధాలను ఎందుకు వాడలేదని చాలామంది ప్రశ్నించారు. దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్.. సైన్యం ఆయుధాలను తమ వెంట తీసుకెళ్లాయి, అయితే కాల్పులు జరపవద్దని ఇరువర్గాల మధ్య ఒప్పందాల కారణంగా వాటిని ఉపయోగించలేదని అన్నారు.ఈ ఒప్పందాలు (చైనాతో) సరిహద్దు నిర్వహణకు వర్తిస్తాయి.. వ్యూహాత్మక సైనిక పరిస్థితులతో వ్యవహరించేటప్పుడు కాదు. చివరగా, సైనికుల ప్రాణాలు లేదా భూభాగం భద్రతకు ముప్పు ఏర్పడినప్పుడు, అక్కడికక్కడే ఫిరంగి దళం సహా అన్ని ఆయుధాలను కమాండర్ తన వద్ద ఉంచుకోవచ్చు’ అని ఉత్తర ఆర్మీ మాజీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హెచ్ఎస్ పనాంగ్ ట్విట్టర్‌లో అన్నారు.‘మన కల్నల్ మీ ముందు చంపబడితే అన్ని నియమాలు పక్కనబెట్టాలి. ప్రోటోకాల్‌ను శత్రువు ఉల్లంఘించి, ప్రమాదకర చర్యలకు పాల్పడితే ఆ నియమాలు మనకెందుకు వర్తించాలి?’ అని రిటైర్డ్ ఆర్మీ అధికారి సందీప్ థాపర్ మండిపడ్డారు.

Related Posts