YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే -  టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి 

సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే -  టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి 

సీఎం నాకు చెప్పిన మొదటి మాట అదే
-  టీటీడీ ఛైర్మన్  వైవి సుబ్బారెడ్డి 
తిరుపతి  జూన్ 19 
" తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తామని పాదయాత్ర లో నేను మాటిచ్చాను. ఆ పని చేయాలి ''  టీటీడీ ఛైర్మన్ గా తనను నియమించాక ముఖ్యమంత్రి  జగన్మోహన్ రెడ్డి  చెప్పిన మొదటి మాట ఇదేనని  వైవి సుబ్బారెడ్డి అన్నారు. తిరుమల సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పిస్తూ సీఎం చట్ట సవరణ చేయించడం పట్ల కృతజ్ఞత తెలుపుతూ యాదవులు శుక్రవారం తిరుపతి పద్మావతి విశ్రాంతి గృహంలో  వైవి సుబ్బారెడ్డి ని సత్కరించారు. తమ కల నిజం చేసినందుకు యాదవులు మొత్తం సీఎం కి రుణపడి ఉంటామని వారు తెలిపారు.   ఈ సందర్భంగా టీటీడీ ఛైర్మన్  సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్న సమయంలో యాదవులు తిరుపతి లో  జగన్మోహన్ రెడ్డి ని కలిసి తమకు న్యాయం చేయాలని కోరారన్నారు. అధికారంలోకి వస్తూనే ఈ హామీ నేరవేరుస్తామని ఆయన  మాట ఇచ్చారని అన్నారు. ఈ విషయం  గుర్తు పెట్టుకున్న ముఖ్యమంత్రి తనను చైర్మన్ గా నియమించిన తర్వాత మొదట ఇదే మాట చెప్పారని ఆయన గుర్తు చేశారు. సీఎం ఆదేశాల మేరకు మొదటి బోర్డు మీటింగ్ లోనే సన్నిధి గొల్లకు మిరాశీ హక్కు కల్పించాలని కోరుతూ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపామన్నారు. అదేవిధంగా సన్నిధి గొల్ల అనే బదులు సన్నిధి యాదవ్ అని మార్చాలని కూడా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపామని  వైవి సుబ్బారెడ్డి చెప్పారు. బోర్డు ప్రతిపాదన మేరకు ప్రభుత్వం  చట్ట సవరణ చేసి యాదవులకు ఇచ్చిన మాట నిలుపుకుందన్నారు. సన్నిధి యాదవ కుటుంబానికి చెందిన  పద్మనాభం,  రమేష్,  కిషోర్ తో పాటు పలువురు యాదవ సంఘం నాయకులు చైర్మన్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Related Posts